Raviteja: ఆవేశం.. రైట్స్.. రవితేజ దగ్గర నిజమేనా..
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:58 PM
ఈ ఏడాది ‘ఆవేశం’తో (Avesam)మంచి హిట్ అందుకున్నారు ఫహద్ ఫాజిల్. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది.
ఈ ఏడాది ‘ఆవేశం’తో (Avesam)మంచి హిట్ అందుకున్నారు ఫహద్ ఫాజిల్. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ అయిన రంగా (ఫహద్ ఫాజిల్)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ ఈ కథలో స్పెషల్ ఎట్రాక్షన్. తెలుగు ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా విలక్షణమైన పాత్రగా నిలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారని తాజా సమాచారం. రవితేజకి సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆయన హీరోగా చేస్తారా? కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల మిస్టర్ బచ్చన్‌తో నిరాశ పరచిన రవితేజ ప్రస్తుతం ుమాస్ జాతర’, కోహినూర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.