Prabhas: ఈ ట్రెండ్ ప్రభాస్ సినిమాలతో మరింతగా పెరిగింది

ABN , Publish Date - Nov 01 , 2024 | 09:57 PM

నేడు టాలీవుడ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుందీ అంటే, అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పాత్ర చాలా అంటే చాలా ఉంది. ప్రాంతీయ సినిమా హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన స్టార్ హీరోస్ చాలా కొద్దిమందే కనిపిస్తారు. తన బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డ్ బాక్సాఫీస్ వసూళ్లతో వారిలో ముందు నిలుస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. రాబోయే ప్రభాస్ చిత్రాల వరుస చూస్తే.. ఇండియన్ సినిమాకు మెంటలెక్కడం ఖాయం.

Rebel Star Prabhas

నేడు టాలీవుడ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుందీ అంటే, అందులో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) పాత్ర చాలా అంటే చాలా ఉంది. ప్రాంతీయ సినిమా హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన స్టార్ హీరోస్ చాలా కొద్దిమందే కనిపిస్తారు. తన బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డ్ బాక్సాఫీస్ వసూళ్లతో వారిలో ముందు నిలుస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ రీసెంట్‌గా ‘కల్కి 2898 AD’తో దిగ్విజయంగా కొనసాగుతోంది. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్.. ఇలా ఏ విషయంలో చూసినా ప్రభాస్ పేరు ఇతర హీరోలు అందుకోలేనంత స్థాయిలో ఉండటం ఇండియన్ సినిమా గమనిస్తూనే ఉంది.

Also Read-L2 Empuraan: ‘హరి హర వీరమల్లు’కి పోటీగా మోహన్ లాల్ సినిమా..

ఒక్క టాలీవుడ్ అనే కాదు.. ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ స్టార్స్‌తో పోటీ పడేంతగా నార్త్‌లో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ.. ఆరాధించేలా చేస్తోంది. అందుకే బాలీవుడ్‌లో తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ప్రభాస్. తమిళ, మలయాళ, కన్నడలోనూ స్థానిక స్టార్ హీరోలతో ప్రభాస్ సినిమాలు పోటీ పడటం నిజమైన పాన్ ఇండియా ట్రెండ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓవర్సీస్‌లోనూ ప్రభాస్ కటౌట్‌కు తిరుగులేదు. ఆయన ‘సలార్, కల్కి’ సినిమాలు ఓవర్సీస్‌లో వసూళ్లతో చరిత్ర సృష్టించాయి.


Rebel-Star.jpg

డిజిటల్ మార్కెట్‌లో హిందీ, రీజనల్‌గా హక్కుల్ని తీసుకునే ట్రెండ్ ప్రభాస్ సినిమాలతో మరింతగా పెరిగింది. ‘సలార్’ హిందీ వెర్షన్ హాట్ స్టార్ తీసుకోగా, రీజనల్ లాంగ్వేజ్‌లు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ‘కల్కి’ సినిమా హిందీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ తీసుకోగా, ప్రైమ్ వీడియో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రైట్స్ కొనుగోలు చేసింది. ఇలా థియేట్రికల్, ఓటీటీ, ఇతర బిజినెస్‌ల ద్వారా ప్రభాస్ సినిమాలు నిర్మాణ వ్యయానికి ఎన్నో రెట్ల లాభాలు ఆర్జిస్తున్నాయి. నిర్మాతలకు ప్రభాస్ సినిమాలు బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం తన ప్రాంఛైజీ సినిమాలతో భారీ పాన్ వరల్డ్ లైనప్ చేసుకున్నారు. ఆయన ‘సలార్ 2, కల్కి 2, స్పిరిట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి.

Also Read-SS Rajamouli: సింహంతో రాజమౌళి.. ఇది ఊహకందని కథ

Also Read-ARM OTT: 2నెల‌ల త‌ర్వాత ఓటీటీకి.. టొవినో థామ‌స్ అదిరిపోయే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్! ఎందులో, ఎప్ప‌టినుంచంటే

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2024 | 09:57 PM