Renu Desai: దయచేసి నన్ను నన్నుగా చూడండి!
ABN , Publish Date - May 18 , 2024 | 04:55 PM
జంతు సంరక్షణ కోసం రేణూ దేశాయి (Renu Desai) విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా (Social media post viral) వేదికగ పలు పోస్ట్‌లతో తెలిపింది.
జంతు సంరక్షణ కోసం రేణూ దేశాయి (Renu Desai) విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా (Social media post viral) వేదికగ పలు పోస్ట్‌లతో తెలిపింది. అది గమనించిన ఓ నెటిజన్ ‘మా పవన్ కల్యాణ్ అన్నయ్యలా గోల్డెన్ హార్ట్’ అని రేణు పోస్ట్‌కు కామెంట్ పెట్టాడు. దానికి ఆమె ఇలా రియాక్ట్ అయ్యారు. (Renu desai react on netizen)
చేసిన కామెంట్‌పై ఆమె ఇలా రియాక్ట్ అయ్యారు. ‘సోషల్ మీడియాలో నేను పెట్టే ప్రతీ పోస్ట్‌పై స్పందిస్తూ ఎప్పుడూ నా మాజీ భర్తతో నన్ను పోలుస్తారెందుకు?’ అంటూ నటి రేణూదేశాయ్ అసహనం వ్యక్తంచేశారు. పదేళ్ల వయసు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నా. దానికి నా మాజీ భర్తతో సంబంధం లేదు. జంతువులపై నేను చూపించే ప్రేమ, కేర్ ఆయనకు లేవు. దయచేసి నేను చేేస పనుల గురించి పోస్ట్ పెడితే.. ఆయన ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి’’ అని మండిపడుతూ పోస్ట్ పెట్టింది. తర్వాత మరో పోస్ట్ చేసింది రేణూ. "ఈ మాటలు బాధతో అన్నవే గానీ కోపంతో కాదని రెండో పోస్ట్ ద్వారా తెలిపారు. వ్యక్తిగతంగా తన మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదని, తనను తానుగా చూడాలంటూ కామెంట్స్ చేసే వారిని కోరారు.