Richa Gangopadhyay: ఈ 'హాట్ క్వీన్' గుర్తుందా.. ఇప్పడు పేరే మార్చేసుకుంది

ABN , Publish Date - Oct 09 , 2024 | 06:18 PM

కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోలతో అవకాశాలు చేజిక్కించుకొని తన గ్లామర్ షోతో అందరిని ఆకట్టుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు కనుమరుగయిపోయింది. ఇప్పుడు తానెక్కడ ఉంది. ఎం చేస్తోందో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ తను ఎవరంటే..

Richa

సినీ ఇండస్ట్రీలో హీరోలు మన్నగలిగినంత కాలం హీరోయిన్లు ఉండలేరు. ఈ గ్లామర్ ఫీల్డ్‌లో అవకాశాలు రావడమే ఒక ఎత్తు అయితే ఆ అవకాశాలను సద్వినియోగ పరుచుకొని నిలదొక్కుకోవటం మరో ఎత్తు. ఇంతా చేసిన వీళ్ళకి ఎదో లాంగ్ లాస్టింగ్ కెరీర్ ఉంటుందా అనేది కూడా సందేహమే. కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోలతో అవకాశాలు చేజిక్కించుకొని తన గ్లామర్ షోతో అందరిని ఆకట్టుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు కనుమరుగయిపోయింది. ఇప్పుడు తానెక్కడ ఉంది. ఎం చేస్తోందో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ తను ఎవరంటే..


రానా దగ్గుబాటి డెబ్యూ ఫిల్మ్ 'లీడర్' సినిమాతో డెబ్యూ చేసిన మరో టాలెంటెడ్ యాక్ట్రెస్ రిచా గంగోపాధ్యాయ్. ప్రస్తుతం ఎవరికీ కనపడటం లేదు. రానాతో పాటు మంచి గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మకి తర్వాత కూడా స్టార్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు లభించాయి. తన రెండో సినిమాలోనే విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది. రజినీకాంత్ చంద్రముఖి సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన 'నాగవల్లి' సినిమా అంతగా ఆడలేదు. అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'మిరపకాయ్' సినిమాలో 'వినమ్రా'గా సంప్రదాయంగానే అందాల ఆరబోత పోసింది. నెక్స్ట్ రెండు తమిళ సినిమాలు, ఒక బెంగాలీ సినిమా చేసి తిరిగి తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండవ సారి రవితేజతో జతకడుతూ 'సారొచ్చారు' సినిమాలో మెరిసింది. ఇక తన కెరీర్లోనే గుర్తిండిపోయే పాత్రా.. ప్రభాస్ మిర్చిలో మానసగా అదరగొట్టింది. చివరగా నాగార్జున భాయ్ సినిమాలో కనిపించి సినిమాలకి గుడ్ బై చెప్పింది.


ఎటెల్లిపోయిందంటే..

సాఫీగా సాగుతున్న కెరీర్లో ఏమైందో ఏమో కానీ 2013లో తాను సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించింది. సినిమాలకు ముందు అమెరికా నుండి వచ్చిన రిచా.. తిరిగి ఆ దేశం వెళ్లిపోయారు. అనంతరం అక్కడ ఎంబీఏ(MBA) పూర్తి చేశారు. అక్కడే తన క్లాస్‌మెట్‌ని ప్రేమించి పెళ్లాడింది. అనంతరం ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అనంతరం తన పేరును రిచా లాంగేళ్ల‌గా మార్చుకుంది.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 06:19 PM