Sai Pallavi: సాయి పల్లవి ట్రెండింగ్.. కారణమిదే
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:09 PM
గతంలో ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్న.. ఆమె చేసిన కామెంట్స్‌ని మరోసారి తెరపైకి తీసుకురావడంతో ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ అమరన్ సినిమా రిలీజ్‌పైన ఏమైనా పడుతుందా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి.. ఇంతకీ ఏమైందంటే..
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), శివకార్తికేయన్ (Sivakarthikeyan) జంటగా విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా అమరన్ (Amaran). ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కానుండగా హీరోయిన్ సాయి పల్లవి వివాదాల్లో చిక్కుకుంది. గతంలో ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్న.. ఆమె చేసిన కామెంట్స్‌ని మరోసారి తెరపైకి తీసుకురావడంతో సాయి పల్లవిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ అమరన్ సినిమా రిలీజ్‌పైన ఏమైనా పడుతుందా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి.. ఇంతకీ ఏమైందంటే..
సహజసిద్ధమైన అందం, అద్భుతమైన నటన తీరుతో కొద్దికాలంలోనే సాయి పల్లవి మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం సౌత్ భాషల్లోనే కాకుండా నార్త్‌లోను తన పెత్తనం చెలాయిస్తోంది. అయితే 2022లో వేణు ఉడుగుల దర్శకత్వంలో రాణా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రటిస్టులలా కనిపిస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. మనం హార్మ్ చేస్తామనుకుంటారు కాబట్టి. మనకు వాళ్లు అలానే కనిపిస్తారు.చూసే విధానం మారిపోతుంది. అందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేను" అన్నారు. దీంతో అప్పట్లో ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచావంటూ కొందరు మనోభావాలు దెబ్బతీసుకున్నారు. ఇదే టాపిక్‌ని మరోసారి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చి ట్విట్టర్లో ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘మీ ప్రేమకి థాంక్యూ సో మచ్. నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకి నచ్చాలని చాలా అంకితభావంతో పని చేస్తాను. తెలుగులో నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరికి ఈ సందర్భంగా థాంక్యూ చెప్తున్నాను. ‘అమరన్’ సినిమాతో మీ (ప్రేక్షకులు) ముందుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ‘అమరన్’ చాలా మంచి సినిమా. ఇది రియల్ సోల్జర్ జర్నీ. రెండు రోజులు ముందు ఆర్మీ వాళ్లకి ఈ సినిమా చూపించినప్పుడు మా లైఫ్ కూడా ఇలాగే ఉందని వారు చెప్పారు. ఈ సినిమాని చాలా రియల్‌గా చూపించారు.