Singer Mangli: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం
ABN , Publish Date - Nov 24 , 2024 | 08:49 PM
తెలుగు వారికి మంగ్లీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది. ముందు ప్రైవేట్ సాంగ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన టాలీవుడ్ లో పాపులర్ సింగర్. ప్రస్తుతం పాటల్లో ఆమె ట్రెండ్ నడుస్తోంది.
తెలుగు వారికి మంగ్లీ (mangli)గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది. ముందు ప్రైవేట్ సాంగ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన టాలీవుడ్ లో పాపులర్ సింగర్. ప్రస్తుతం పాటల్లో ఆమె ట్రెండ్ నడుస్తోంది. . ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తుంది.. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ అయింది. ఇక మంగ్లీకి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల పాటలను పాడుతూ క్రేజ్ సొంతం చేసుకుంది.. గత కొన్నేళ్లుగా మంగ్లీ టాలీవుడ్ లో సత్తా చాటుతుంది.
జార్జి రెడ్డి (George Reddy) మూవీలోని 'రాయల్ ఎన్ఫీల్డ్' సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం అల వైకుంఠపురంలో 'రాములో రాములా', లవ్ స్టోరీ చిత్రంలోని 'సారంగదరియా'తో పాటు అనేక సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె తో పాడించిన పాటలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. దాంతో సినీ దర్శకులు ఆమెతో పాట పాడించాలని ఫిక్స్ అవుతున్నారు. సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి (Ustad Bismillah Khan Yuva Puraskar)ఎంపికైంది. ఆమె ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారధుల సమక్షంలో అందుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న సత్యవతీ చౌహాన్ అలియాస్ మంగ్లీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పురస్కార నిర్వాహకులు అన్నారు