Sharwanand: అలాంటి ప్రాణ స్నేహితుడు ఉండటం అదృష్టం!
ABN , Publish Date - Feb 14 , 2024 | 04:41 PM
హీరోగా, కెరీర్లో ఇంత ఆనందంగా ఉన్నానంటే రామ్‌చరణ్‌లాంటి ప్రాణ స్నేహితుడు ఉండటమే కారణమని శర్వానంద్ అన్నారు. తాజాగా ఆయన మంచు మనోజ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ఉస్తాద్’ షోకు అతిథిగా హాజరయ్యారు.
హీరోగా, కెరీర్లో ఇంత ఆనందంగా ఉన్నానంటే రామ్‌చరణ్‌లాంటి ప్రాణ స్నేహితుడు ఉండటమే కారణమని శర్వానంద్ అన్నారు. తాజాగా ఆయన మంచు మనోజ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ఉస్తాద్’ షోకు అతిథిగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్లో చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి చెప్పమని శర్వాను అడడగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శర్వానంద్. 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' చిత్రంలో చిన్న సీన కోసం ఓ కుర్రాడు కావాల్సి వస్తే మన శర్వా ఉన్నాడుగా వాడితో చేయిద్దాం అని చరణ్‌తో నాకు కబురు పంపారు. నేను కాసేపు షాక్‌లో ఉన్నా. చిరంజీవిగారితో ఫోటో ఉంటే చాలు.. అనుకున్న నాకు ఆయనతో కొన్ని సీన్లు నటించే అవకాశం వచ్చింది. అదంతా కూడా రామ్‌చరణ్ నా స్నేహితుడు కావడం వల్లే. నేను ఈ రోజున ఇలా ఉన్నాను అంటే దానికి చరణే కారణం. ఎవరికైనా ఆపద అంటే చిరంజీవిగారు ఎలాగైతే అండగా ఉంటారో, రామ్‌చరణ్ కూడా అంతే. నమ్మినవారికి వదిలిపెట్టడం చిరంజీవి గారికి తెలీదు. అదే రామ్‌చరణ్‌కు కూడా వచ్చింది. ప్రేమను పంచడంలో కానీ, కష్టం అంటే మనతో నిలబడటంలో కానీ చరణ్ ది బెస్ట్. అలాంటి వ్యక్తి నాకు ప్రాణ స్నేహితుడని గర్వంగా చెప్పుకుంటా. చిరంజీవి గారిలో ఉన్న మంచి లక్షణాలన్నీ చరణ్‌లో ఉన్నాయి’’ అన్నారు. ఇదే వేదికపై మనోజ్ కూడా చిరంజీవి గురించి మాట్లాడారు. ’’చిరంజీవి గారి గొప్పతనం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనను నమ్ముకున్న వారందరికీ సపోర్ట్‌గా నిలిచారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు’’ అని అన్నారు.
ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది ఫిష్’ సినిమాతో మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శర్వానంద్ శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'మనం’ అనే సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.