Shree leela: బన్నీతో శ్రీలీల క్రాష్ కోర్సు
ABN , Publish Date - Nov 16 , 2024 | 10:21 PM
టాలీవుడ్‌లో ఈ జనరేషన్ హీరోయిన్స్‌లో గొప్ప డాన్సర్ ఎవరంటే గుర్తొచ్చే మూడు నాలుగు పేర్లలో శ్రీ లీల (Shree leela) ఒకటి. ఆమె డాన్స్ చూసిన వారంతా ఆమెలో ఎముకలు ఉన్నాయా? లేవా అన్నంత ఆశ్చర్యానికి లోనవుతారు. అంతగా యువత మదిని తన డ్యాన్స్‌తో గెలుచుకుంది.
టాలీవుడ్‌లో ఈ జనరేషన్ హీరోయిన్స్‌లో గొప్ప డాన్సర్ ఎవరంటే గుర్తొచ్చే మూడు నాలుగు పేర్లలో శ్రీ లీల (Shree leela) ఒకటి. ఆమె డాన్స్ చూసిన వారంతా ఆమెలో ఎముకలు ఉన్నాయా? లేవా అన్నంత ఆశ్చర్యానికి లోనవుతారు. అంతగా యువత మదిని తన డ్యాన్స్‌తో గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప ది రూల్’ (Pushpa 2) భాగమైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆమె ‘కిస్సిక్’ అనే ఐటమ్ సాంగ్‌లో భాగమయ్యారు. ఇటీవల షూట్‌లో కూడా పాల్గొన్నారు. అల్లు అర్జున్‌తో వర్క్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఈమేరకు ఆయనకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ‘‘టు బన్నీ సర్.. ప్రేమ, గౌరవంతో ఈ నోట్ మీకు పంపిస్తున్నాను. మీతో వర్క్ చేయడం నాకెంతో అందమైన అనభూతిని పంచింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు. నిజం చెబుతున్నా ఈ ఐదారు రోజులు నాకు ఒక క్రాష్ కోర్సులా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమాభినందనలు’’ అని ఆమె రాసుకొచ్చారు. తగ్గేదేలే, శ్రీవల్లి, సామి, వైల్డ్ ఫైర్ వంటి హ్యాష్‌ట్యాగ్స్ జత చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘థ్యాంక్యూ మై డియర్. మీ మాటలు నా మనసుని తాకాయి.. నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి’’ అని తెలిపారు. అంతే కాకుండా శ్రీలీలను డ్యాన్సింగ్ క్వీన్ అని పేర్కొన్నారు.
‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్’ తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శ్రీవల్లిగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. కూలీగా ఉన్న పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? చుట్టుపక్కల గ్రామాల వారికి ఏవిధంగా సాయం చేశాడు? అనే విషయా?ను ‘పుష్ప ది రూల్’లో చూడొచ్చు.