Siddhu Jonnalagadda: సిద్ధు రూ.15 లక్షల విరాళం
ABN , Publish Date - Dec 08 , 2024 | 07:45 PM
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని (TG Govt Revanth Reddy)మర్యాదపూర్వకంగా కలిశారు.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని (TG Govt Revanth Reddy)మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటిన సిద్ధు జొన్నలగడ్డను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
సిద్దు ఈ ఏడాది 'టిల్లు స్క్వేర్' చిత్రంతో మెప్పించారు, 'మిస్టర్ బచ్చన్' చిత్రంలో గెస్ట్ రోల్ చేసారు. ప్రస్తుతం అయన 'తెలుసు కదా' (Telusu Kada) చిత్రం చేస్తున్నారు. నీరజ కోన (Neeraja kona) దర్శకత్వం వహిస్తున్నారు.