Singer Sunitha: ఆ క్షణం నా లైఫ్‌నే మార్చేసింది! 

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:21 PM

సింగర్‌ సునీత (Singer sunitha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మఽధురమైన గొంతుకు ఫిదా కాని వారుండరు. 17 ఏళ్లకే యాంకర్‌గా, గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుంది.

 Singer Sunitha: ఆ క్షణం నా లైఫ్‌నే మార్చేసింది! 

సింగర్‌ సునీత (Singer sunitha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మఽధురమైన గొంతుకు ఫిదా కాని వారుండరు. 17 ఏళ్లకే యాంకర్‌గా, గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక వ్యక్తిగత కారణాలతో భర్తతో విడాకులు తీసుకుంది. అయితే సునీతకు ఇంటి బాఽధ్యతలు ఎక్కువ. ఆమె అమ్మమ్మ నుంచి ఇప్పటికి మూడు తరాల వారిని ఆమె పోషిస్తున్నారు. విడాకులు అయ్యి  ఏళ్లు గడుస్తున్నా విమర్శలు మాత్రం ఇంకా ఆమె వెంటాడుతూనే ఉన్నాయి. బరువు బాధ్యతలు, విమర్శలు ఇన్ని ఒత్తిళ్ల మధ్య వృత్తిని మాత్రం సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. రెండేళ్ల క్రితమే ఆమె మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జనవరి 9న, 2021లో వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని పెళ్లాడింది. ఆమెకు రెండో పెళ్లయ్యాక మూడో వివాహా వార్షికోత్సవం ఇవాళ జరుపుకోనుంది. (Marriage anniversary)

సునీత పెళ్లి ఫొటోను షేర్‌ చేసి 'ఆ క్షణం నా లైఫ్‌ మొత్తాన్ని మార్చేసింది. మంచి జీవితంలోకి తీసుకెళ్లింది’’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం సునీత పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా సింగర్‌ సునీత కుమారుడు ఆకాశ్‌ హీరోగా  ఎంట్రీ ఇచ్చారు. 'ుసర్కారు నౌకరి’ అనే చిత్రంలో నటించారు. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Updated Date - Jan 09 , 2024 | 04:22 PM