Murali Mohan: కీరవాణి కుమారుడితో మా మనవరాలి పెళ్లి 

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:23 AM

ఆస్కార్‌ గ్రహీత ఎమ్‌ఎమ్‌ కీరవాణి (MM Keeravani) తనయుడు, హీరో శ్రీ సింహతో (Sri Simha).. నటుడు మురళీ మోహన్‌ (murali mohan) మనుమరాలి పెళ్లి జరగనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే!

Murali Mohan: కీరవాణి కుమారుడితో మా మనవరాలి పెళ్లి 

ఆస్కార్‌ గ్రహీత ఎమ్‌ఎమ్‌ కీరవాణి (MM Keeravani) తనయుడు, హీరో శ్రీ సింహతో (Sri Simha).. నటుడు మురళీ మోహన్‌ (murali mohan) మనుమరాలి పెళ్లి జరగనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే! అవన్నీ నిజమేనని తాజాగా మురళీ మోహన్‌ కూడా ప్రకటించారు. తాజాగా ఆ పెళ్లి వేడుక విషయంపై మురళీ మోహన్‌ కోడలు మాగంటి రూప (maganti Roopa) ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో తన కూతురు ‘రాగ’ (Raaga)పెళ్లి ఫిక్స్‌ అయినట్లు ఆమె తెలిపారు. మురళీ మోహన్‌ సినిమా ఇండస్ర్టీలోకి వచ్చే 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనతో పాటుగా కోడలు రూప కూడా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగుతుందని ఆమె వెల్లడించారు.  

Keeravani.jpg

సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కూతురు  విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్‌ మోహన్‌ మాత్రం ఆయనకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్‌ మోహన్‌- రూపల కుమార్తెనే ‘రాగ’. విదేశాల్లో ఆమె బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇక శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా మారాడు. 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త', 'ఉస్తాద్‌' సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

Anasuya Bharadwaj: నాకు సింపతి అక్కర్లేదు


Updated Date - Apr 06 , 2024 | 04:16 PM