Srikanth: శ్రీకాంత్‌కి 'నో' చెప్పిన ప్రొడ్యూసర్
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:32 PM
శ్రీకాంత్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచినా ఓ సినిమాకి ప్రొడ్యూసర్లు తనని వద్దని ఫోర్స్ చేశారట. దీంతో ఆ సినిమా దర్శకుడు ఏం చేశాడంటే..
హీరో శ్రీకాంత్(Srikanth) యవ్వనంలో ఉన్నప్పుడు అటు కుర్రకారుల్లో, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ల్లో మంచి క్రేజ్ సంపాదించుకొని టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలలో ఒకరిగా చలామణి అయ్యాడు. ప్రస్తుతం కూడా కెరీర్లో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ రాణిస్తున్నాడు. దీంతో అప్పట్లోనూ, ఇప్పట్లోనూ నిర్మాతలకి శ్రీకాంత్ మంచి ఛాయిస్‌గానే నిలిచాడు. అయితే శ్రీకాంత్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచినా ఓ సినిమాకి ప్రొడ్యూసర్లు తనని వద్దని ఫోర్స్ చేశారట కానీ.. ఆ చిత్ర దర్శకుడు చేసిన హైరానా వల్లే శ్రీకాంత్‌ని ఓకే చేశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అక్కడ ఏం జరిగిందంటే..
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల సందడి కొనసాగుతోంది. గత రెండు నెలల్లోనూ మహేష్ బాబు 'మురారి', పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలు కలెక్షన్ల జల్లు కురిపించాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణ వంశీ(Krishna Vamsi) సెన్సేషనల్ మూవీ 'ఖడ్గం' (Khadgam) రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. వాస్తవానికి ఈ సినిమాని గత నెలలోనే రిలీజ్ చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల చేత ఈ నెల 18కి వాయిదా పడింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఈ మీటింగ్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'మొదట్లో ఈ సినిమా ప్రొడ్యూసర్ మధుమురళి గారు నన్ను ఈ సినిమాకి వద్దన్నారని, ఎవరైనా పెద్ద స్టార్ హీరో అయితే బెటర్ అని అన్నారు. కానీ.. డైరెక్టర్ కృష్ణ వంశీ మాత్రం శ్రీకాంతే కరక్ట్ అని పట్టుబడటంతో ఈ సినిమా చేశానని' చెప్పుకొచ్చారు.
అలాగే సినిమా రిలీజై ఇన్నేళ్ళైనా ఇప్పుడొస్తున్న చాలా దేశభక్తి చిత్రాల కంటే ఖడ్గం సినిమా చాలా మిన్న అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. 2002లో రిలీజైన ఈ సినిమా ఆగష్టు 15న, జనవరి 26న ఇప్పటికి ప్రతి ఇంట్లో ప్రసరమవుతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌తో పాటు రవితేజ, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్, బ్రహ్మజీ, సోనాలి బింద్రే మరియు సంగీత కీలక పాత్రల్లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.