SS Rajamouli: తారక్ నా ఫ్రెండ్ కాదు.. తమ్ముడు లాంటివాడు!
ABN , Publish Date - May 02 , 2024 | 04:29 PM
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తారక్‌కి (Jr ntr) మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే! వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలు తారక్ కెరీర్‌ని మలుపుతిప్పాయి
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తారక్‌కి (Jr ntr) మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే! వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలు తారక్ కెరీర్‌ని మలుపుతిప్పాయి. రాజమౌళి ఎక్కువ సినిమాలు తారక్‌తోనే చేశారు. సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. కుదిరిన ప్రతిసారీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చెబుతుంటారు. తాజాగా ‘కృష్ణమ్మ’ (Krishnamma) ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. సత్యదేవ్ హీరోగా వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి తారక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని యాంకర్ ప్రశ్నించగా.. ఆడిటోరియంలోని ప్రేక్షకులంతా ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దానికి రాజమౌళి ‘ ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ‘బాహుబలి’, ‘ఈగ’ నిర్మాతలు సాయి కొర్రపాటి, శోభు యార్లగడ్డ నాకు మంచి ేస్నహితులు. ఎన్టీఆర్ నాకు స్నేహితుడు కాదు. తమ్ముడితో సమానం’’ అని సమాధానమిచ్చారు. తన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ అవకాశం రావడానికి రచయిత పృథ్వీతేజ కారణమని చెప్పారు జక్కన్న. విజయవాడ అనగానే తనకు కనకదుర్గ గుడి గుర్తుకు వస్తుందన్నారు. తనకు స్వీట్స్ అంటే ఇష్టమని చెప్పారు.
కృష్ణమ్మ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారని తెలియగానే నా దృష్టి దీనిపై పడింది. దర్శకుడి మాటల్లోని నిజాయతీ ఈ సినిమాలోనూ ఉంటుందని నమ్ముతున్నా. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమా చూడాలనిపించేలా ఉన్నాయి. సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. అది ఈ ‘కృష్ణమ్మ’ చిత్రంతో సాధ్యమవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు.