Sudheer Babu: హీరోయిన్‌పై సుధీర్ బాబు కామెంట్స్ వైరల్.. నెపోటిజం
ABN , Publish Date - Nov 20 , 2024 | 01:16 PM
తాజాగా హీరో సుధీర్ బాబు ఓ హీరోయిన్ బాడీ పర్సనాలిటీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆయన ఏమన్నారంటే..
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికిసిద్ధమయ్యారు. ‘గుణ 369’తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి హీరో సుధీర్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
హీరోయిన్ మానస వారణాసి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుధీర్ బాబు మాట్లాడుతూ."సన్నగా ఉండే హీరోయిన్లకు కెరీర్ ఎక్కువగా ఉంటుందన్నారు. “ఈ సినిమా హీరోయిన్ మానస చాలా చక్కగా మాట్లాడుతుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాకు మాట్లాడాలంటే భయంగా ఉండేది. మాట్లాడను అనే చెప్పేవాడిని. కానీ, ఈ అమ్మాయి యాక్టివ్‌గా మాట్లాడుతుంది. పాత రోజుల్లో హీరోయిన్ల కెరీర్ సన్నగా ఉన్నప్పుడు మొదలై లావుగా అయ్యే వరకు కొనసాగేది. ఈ అమ్మాయి మరీ సన్నగా ఉంది. లాంగ్ కెరీర్ ఉంటుంది అనిపిస్తుంది” అంటూ కామెంట్ చేశారు.
ఈ ఈవెంట్‌లో నెపోటిజంపై సుధీర్ బాబు మాట్లాడుతూ.. "సినిమా పరిశ్రమలో హీరోగా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. సాధారణం నెపో కిడ్ అని చెప్తుంటారు. ఎవరైనా ఓ వ్యక్తికి బాగా ఆకలేసి తినడానికి అన్నం లేదు. నువ్వుఈ పని చేస్తే నీకు అన్నం దొరుకుతుంది అంటే తప్పకుండా ఆ వ్యక్తి ఆ పని చేస్తాడు. ఇంకో వ్యక్తికి ఇంటి చుట్టూ రెస్టారెంట్లు పెట్టుకునే శక్తి ఉంది. 20 మంది వంట మనుషులను పెట్టుకునే కెపాసిటీ ఉంది. తన సొంత పొలం నుంచే కూరగాయలు, ధాన్యం వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి కష్టపడి ఫుడ్ సంపాదించుకోవాలి అనుకోవడం నిజంగా గొప్ప విషయం. అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అశోక్. గత 8 ఏండ్లుగా హీరోగా సక్సెస్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అవుతాడు. ఈ సినిమానా, నెక్ట్స్ సినిమా అనేది కాదు. తప్పకుండా మంచి హీరోగా సెటిల్ అవుతాడు" అన్నారు.