Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలో.. సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’

ABN , Publish Date - Oct 14 , 2024 | 02:15 PM

కాస్త విరామం త‌ర్వాత సుమంత్ న‌టిస్తోన్న కొత్త చిత్రం మహేంద్రగిరి వారాహి. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

Mahendragiri Vaarahi

కాస్త విరామం త‌ర్వాత సుమంత్ న‌టిస్తోన్న కొత్త చిత్రం మహేంద్రగిరి వారాహి (Mahendragiri Vaarahi). రాజశ్యామల బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెంబరు 2గా తెరకెక్కుతున్న ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అయితే ఈ మూవీ గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉందంటూ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో గ్లిమ్స్ కు మ‌రింత‌గా స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

GZsqkx9XwAwYVW-.jpeg

సుమంత్ (Sumanth) చివ‌ర‌గా 2021లో మ‌ళ్లీ మొద‌లైంది సినిమాలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా 2022లో ధ‌నుష్‌ సార్‌, తుల్క‌ర్ స‌ల్మాన్ సీతారామం సినిమాల్లో క్యారెక్ట‌ర్ పాత్ర‌ల్లోన‌టించారు. ఇప్పుడు మైడేండ్ల విరామం త‌ర్వాత హీరోగా ‘మ‌హేంద్ర‌గిరి వారాహి’ (Mahendragiri Vaarahi) అనే ఓ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు.


‘రంగమార్తాండ’ వంటి సినిమా తర్వాత రాజ‌శ్యామ‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంతోష్ జాగ‌ర్ల‌మూడి (Santhossh jagarlapudi) ద‌ర్శ‌కుడిగా, మీనాక్షి గోస్వామి (Minakshi goswamy) క‌థానాయిక‌గా పరిచ‌యం అవుతోంది. బ్రహ్మానందం కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

WhatsApp Image 2024-10-14 at 1.45.55 PM.jpeg

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. వచ్చే ఏడాది.. 2025 సంక్రాంతికి ఈమహేంద్రగిరి వారాహి చిత్రాన్ని విడుదల చెయ్యడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Updated Date - Oct 14 , 2024 | 02:15 PM