Suryakantam: నటి సూర్యకాంతం కొడుకు.. కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:53 PM

సూర్యకాంతం (Suryakantham) టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి. కాకినాడ ప్రాంతంలో పుట్టిన ఆమె జెమిని స్టూడియో నిర్మించిన 'చంద్రలేఖ' (Gayyali atha) చిత్రంతో డాన్సర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు.

సూర్యకాంతం (Suryakantham) టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి. కాకినాడ ప్రాంతంలో పుట్టిన ఆమె జెమిని స్టూడియో నిర్మించిన 'చంద్రలేఖ' (Gayyali atha) చిత్రంతో డాన్సర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పుడు ఆ పాత్రకు ఆమె అందుకున్న పారితోషికం రూ. 75. ఆ తర్వాత 'నారద నారది' చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తొలి అవకాశం అందుకున్నారు. తదుపరి 'సౌదామిని' చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కింది. అయితే ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారు. తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయాలు కాగా కొంతకాలం విరామం తర్వాత మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి గయ్యాళి అత్తగా, వైవిధ్యమైన హాస్య నటిగా ఎన్నో పాత్రలతో మెప్పించారు. 1946లో నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె నాలుగున్నర దశాబ్దాలపాటు దక్షిణాది ప్రేక్షకులకు అలరరించారు. 1994లో వచ్చిన ఎస్‌.పి.పరశురామ్‌ ఆమె నటించిన చివరి చిత్రం. (Suryakantham centenary celebrations)

Surya-2.jpg

అదే సంవత్సరం డిసెంబర్‌లో సూర్యకాంతం మరణించారు. ఈ ఏడాది ఆమె శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు సూర్యకాంతం తనయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. "గత ఏడాది నవంబర్‌ 5న చెన్నైలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా ‘ఆంధ్రుల అభిమాన అత్తగారు’ పుస్తక ఆవిష్కరణతో ఇప్పటికే సూర్యకాంతం శత జయంతి ఉత్సవాలు మొదలైన సంగతి తెలిసిందే! తదుపరి సెప్టెంబర్‌ 11వ తేదిన శత జయంతి  వేడుకల్లో భాగంగా నరవ ప్రకాశరావు సహకారంతో  పద్మభూషణ్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ అధ్యక్షతన విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మరో వేడుక జరిగింది. వచ్చే నెల 13న జానకిరామ్‌ చౌదరి సహకారంతో ‘‘ది యంగ్మెన్స్‌ హ్యాపీ క్లబ్‌’’ కాకినాడ వారి ఆధ్వర్యంలో దంటు భాస్కరరావు గారి సహాయ సహకారాలతో దంటు కళాక్షేత్రం, కాకినాడలో మరొక ‘శతజయంతి’ కార్యక్రమం జరగబోతోంది’’ అని ఆయన తెలిపారు. 

Updated Date - Sep 30 , 2024 | 04:30 PM