Sidhika Sharma: అదృష్టం అస్స‌లు లేని.. ఈ గ్లామ‌ర్ హీరోయిన్ గురించి మీకు తెలుసా

ABN , Publish Date - Sep 25 , 2024 | 10:33 AM

కొంత‌మంది క‌థానాయిక‌లకు అందం లేకున్నా న‌ట‌న‌తో నిల‌బ‌డ‌తారు, మ‌రికొంత‌మందికి అందం, న‌ట‌న, గ్లామ‌ర్‌ ఉన్నా కొద్ది అదృష్టం లేక మ‌రుగున ప‌డిపోతుంటారు. ఆ కోవ‌కు చెందిన న‌టే సిద్ధికా శర్మ

Sidhika Sharma

ఈ సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్‌ రాత ఎప్పుడు ఎలా ఉంటుందో అస‌లు చెప్ప‌లేం. కొంత‌మంది క‌థానాయిక‌లకు అందం త‌క్కువ‌గా ఉన్నా న‌ట‌న‌తో నిల‌బ‌డ‌తారు, మ‌రికొంత‌మంది న‌ట‌న రాకున్నా అందంతో లాక్కోస్తారు.. మ‌రికొంత‌మందికి అందం, న‌ట‌న, గ్లామ‌ర్‌ ఉన్నా ఆవ‌గింజంత అదృష్టం లేక మ‌రుగున ప‌డిపోతుంటారు. ఆ మూడో కోవ‌కు చెందిన న‌టే సిద్ధికా శర్మ (Sidhika Sharma).

Sidhika Sharma

ఉత్తరాదికి చెందిన ఈ భామ 2012లోనే తెలుగు సినిమాతో అడుగు పెట్టినా ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన బ్రేక్ లేక క‌నుమ‌రుగ‌వుతున్న తార‌ల జాబితాలోకి చేరిపోయింది.

Sidhika Sharma

స‌రిగ్గా పుష్క‌రం క్రితం జేడీ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్‌, జేడీ హీరోలుగా న‌టించిన ఆల్ ది బెస్ట్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్ సుంద‌రి ఆ త‌ర్వాత గ‌ల్లీ కుర్రాళ్లు, నానితో పైసా, ప్రేమ ప‌రిచ‌యం, నిన్నే పెళ్లాడ‌తా వంటి సినిమాల్లో న‌టించింది.

Sidhika Sharma

ఆ త‌ర్వాత‌ పంజాబీలో 2, త‌మిళంలో ఒక‌టి చొప్పున మూవీస్‌లో న‌టించింది కానీ ఎక్క‌డా బ్రేక్ ల‌భించ‌క కెరీర్ సాగ‌క అవ‌కాశాల కోసం వేచి చూస్తోంది..ఈ భామ రీసెంట్‌గా న‌టించిన త‌మిళ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది.


Sidhika Sharma

అయితే చేతిలో సినిమాలు లేకున్నా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న‌ ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్‌లో త‌న అందాల‌ను ఆర‌బోస్తూ నెటిజ‌న్ల‌కు క‌నుల విందు చేస్తోంది.

Sidhika Sharma

నిత్యం ధ‌రించే దుస్తుల విష‌యంలో చాలా పొదుపు పాటిస్తూ నేటి యువ హీరోయిన్ల‌ను సైతం మైమ‌రిపిస్తూ, రోజుకోర‌క‌మైన ఫొటోషూట్ల‌తో కుర్ర‌కారుకు మ‌త్తెక్కిస్తుంది.

Sidhika Sharma

త‌రుచూ విహార యాత్ర‌లు చేస్తూ ప్ర‌కృతితో క‌లిపి త‌న అందాల‌ను ఫుల్ మీల్స్‌గా పెడుతుంది. ఆ చిత్ర‌మాలిక‌ల‌ను చూసిన వారంతా తాము అస‌లు ఇలాంటి హీరోయిన్‌ను ఇన్నాళ్లు ఎలా మిస్స‌యామంటు తెగ‌ బాధ ప‌డుతున్నారు.

Sidhika Sharma

Sidhika Sharma

Updated Date - Sep 25 , 2024 | 10:33 AM