ఈవారం థియేట‌ర్ల‌లో ర‌చ్చ‌ర‌చ్చే.. ఎన్ని సినిమాలు విడుద‌ల‌వుతున్నాయంటే!

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:10 PM

ఈవారం థియేట‌ర్ల‌పై చిన్న చిత్రాల దండ‌యాత్ర ఓ రేంజ్‌లో ఉండ‌నుంది. గ‌త‌వారం విడుద‌లైన దేవ‌ర‌, స‌త్యం సుంద‌రం వంటి భారీ చిత్రాల హ‌వా కాస్త త‌గ్గ‌డంతో ఈ సారి అర డ‌జ‌నుకు పైగానే సినిమాలు థియేట‌ర్ల బాట ప‌డుతున్నాయి.

theaters

ఈవారం థియేట‌ర్ల‌పై చిన్న చిత్రాల దండ‌యాత్ర ఓ రేంజ్‌లో ఉండ‌నుంది. గ‌త‌వారం విడుద‌లైన దేవ‌ర‌, స‌త్యం సుంద‌రం వంటి భారీ చిత్రాల హ‌వా కాస్త త‌గ్గ‌డంతో ఈ సారి అర డ‌జ‌నుకు పైగానే సినిమాలు థియేట‌ర్ల బాట ప‌డుతున్నాయి. ఎక్కువ‌గా తెలుగు నుంచి 8 సినిమాలు విడుద‌ల అవుతుండ‌గా ఒక్క డ‌బ్బింగ్ చిత్రం లేకుండా అవ‌న్నీ స్ట్రెయిట్ చిత్రాలే అవ‌డం విశేషం. పైగా వాట‌న్నింటిలో పేరున్న న‌టీన‌టులు న‌టించ‌డం, ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉండ‌డం మ‌రో విశేషం.

swag.jpg

అయితే తెలుగు నుంచి వ‌స్తున్న చిత్రాల్లో శ్రీవిష్ణు న‌టించిన స్వాగ్‌, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మ‌నుమ‌డు సుద‌ర్శ‌న్ న‌టించిన మిస్ట‌ర్ సెల‌బ్రిటీ, మంత్ర‌, మంగ‌ళ వంటి హిట్ చిత్రాల రూపొందించి సుమారు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఓషో తుల‌సీరామ్‌ మ‌ళ్లీ ద‌ర్శ‌క‌త్వంలో క‌బాలి ఫేమ్ సాయి ధ‌న్సిక మెయిన్ లీడ్‌గా రూపొందిన ద‌క్షిణ‌, సింగ‌ర్ నోయ‌ల్ న‌టించిన బ‌హిర్భూమి, ఈటీవీ ప్ర‌భాక‌ర్ కుమారుడు చంద్ర‌హాస్ హీరోగా న‌టించిన రామ్ న‌గ‌ర్ బ‌న్నీ, ప్రిన్స్‌, న‌రేశ్ అగ‌స్త్య న‌టించిన క‌లి వంటి చిత్రాలు ఈ శుక్ర‌వారం ప్రేఓకుల ముందుకు వ‌స్తున్నాయి.

Mr Celebrity

వీటితోపాటు హాలీవుడ్ నుంచి జోక‌ర్‌, వైట్‌బ‌ర్డ్ అనే రెండు చిత్రాలు రెండు రోజులు ముందుగానే బుధ‌వార‌మే థియేట‌ర్ల‌లోకి రాగా రెండు హిందీ, మూడు క‌న్న‌డ‌, నాలుగు త‌మిళ‌, ఐదు మ‌ల‌యాళ సినిమాలు ఈ వారం అయా రాష్ట్రాల‌లో ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాయి. ఇక త‌ర్వాతి వారం ర‌జ‌నీకాంత్ వెట్ట‌యాన్‌, గోపీచంద్ విశ్వం, సుహాస్ జ‌న‌క అయితే గ‌న‌క‌, క‌న్న‌డ నుంచి మార్టిన్ వంటి భారీ చిత్రాలు ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లోకి రానున్నాయి.


Ramnagar Bunny

ఈవారం అయా భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి రాబోతున్న చిత్రాలివే

Telugu

Chitti Potti (చిట్టి పొట్టి) Oct 3

Kali (క‌లి) Oct 4

SWAG (స్వాగ్‌) Oct 4

Dhakshina (ద‌క్షిణ) Oct 4

Yama Kantri (యమకంత్రి) Oct 4

Bahirbhoomi (బ‌హిర్భూమి) Oct 4

Mr. Celebrity (మిస్ట‌ర్ సెల‌బ్రిటీ) Oct 4

Ramnagar Bunny (రామ్ న‌గ‌ర్ బ‌న్నీ) Oct 4

GYpaG9gaUAATUjV.jpeg

Hindi

Shahkot Oct 4

Last World War

English

Joker: Folie a Deux Oct 2

White Bird: A Wonder Story Oct 2

joker.jpg

Tamil

Seeran

Aaragan

Appu VI STD

Neela Nira Sooriyan

Kannada

Bhairadevi Oct 3

Minchuhulu

Gopilola

Bhairadevi_ee6c33ef3b.jpg

Malayalam

Koon

Oru Kattil Oru Muri

Thanupp

Pushpaka Vimanam

Thekku Vadakku

Updated Date - Oct 02 , 2024 | 01:10 PM