ANR Award: ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్ ఎవరికో చెప్పేసిన కింగ్ నాగార్జున

ABN , Publish Date - Sep 20 , 2024 | 06:25 PM

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లో 100వ పుట్టినరోజు వేడుకలను అక్కినేని ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య మినహా అక్కినేని కుటుంబం మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్‌ను ఎవరికి ఇవ్వబోతున్నారో కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు.

King Nagarjuna

ఈ ఏడాది ఎఎన్ఆర్ అవార్డ్‌ను (ANR Award) మెగాస్టార్ చిరంజీకి ఇవ్వబోతున్నట్లుగా ఆయన తనయుడు, కింగ్ నాగార్జున (King Nagarjuna) అధికారికంగా ప్రకటించారు. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లో 100వ పుట్టినరోజు వేడుకలను అక్కినేని ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబం మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవికి అక్టోబర్ 28న బిగ్ బి అమితాబ్ చేతుల మీదుగా ఇవ్వబోతున్నట్లుగా కింగ్ నాగార్జున ప్రకటించారు. అలాగే బాపుగారు గీసిన ఏఎన్నార్ చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ రూపంలో విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని కింగ్ నాగ్ తెలిపారు.

Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య


Chiranjeevi.jpg

పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అంటే మాకు ఎంతో ప్రేమ. నాన్న మాకు నవ్వుతూ జీవించటం నేర్పించారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాలు తెలియజేస్తున్నాను. చాలా దూరం నుంచి విజయ చాముండేశ్వరి వంటి వారెందరో వచ్చారు. వారందరికీ థ్యాంక్యూ. 31 సిటీస్‌లో 60కి పైగా థియేటర్స్‌లో నాన్నగారి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలన్నింటినీ ఉచితంగా చూడవచ్చు. ఈ వేదికపై నాన్నగారి స్టాంప్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. నాన్నగారి అభిమానులు శతజయంతిని చాలాగొప్పగా సెలబ్రేట్ చేశారు. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్‌ను (ANR National Award) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)గారికి అక్టోబర్ 28న బిగ్ బి అమితాబ్‌గారి చేతుల మీదుగా ప్రధానం చేయనున్నాము..’’ అని తెలిపారు.


బాపుగారు గీసిన చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ రూపంలో రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు వెంకట్ అక్కినేని. ఇదే కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘‘నేను చిన్నప్పటి నుంచి అక్కినేనిగారి అభిమానిని. అలాంటిది అక్కినేనిగారి పక్కన నటించే అవకాశం నాకు లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై తెరకెక్కిన మొదటి సినిమాలో నేనే హీరో. ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు నేనే అని అక్కినేని సర్టిఫికేట్ ఇచ్చారు. అంతకంటే ఇంకేం కావాలి. హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీ‌ని డెవలప్ చేసిన తొలి వ్యక్తి అక్కినేని..’’ అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే


Read Latest Cinema News

Updated Date - Sep 20 , 2024 | 07:49 PM

ANR: అక్కినేని.. అవార్డులు.. బిరుదులు

ANR: మృత్యువు మీద సాధించిన విజయమే

ANR- Annapurna: ఏయన్నార్‌నే పెళ్లాడతానని భీష్మించి మరీ..

ANR@100: గ్లాసు పట్టుకుంటే దేవదాసు.. కలం పట్టుకుంటే కాళిదాసు

ANR: అటువంటి ధీరగుణం కలిగిన అరుదైన వ్యక్తి అక్కినేని