Trivikram : ఎంతో ప్రేమ చూశాడు.. రెట్టింపు ద్వేషమూ చూశాడు
ABN , Publish Date - Oct 28 , 2024 | 10:11 AM
విజయ్ దేవరకొండ నాకు బాగా ఇష్టమైన నటుల్లో ఒకరు. సినిమాల్లోకి వచ్చాక ఎంతో ప్రేమను చూశాడు.. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. చాలా గట్టోడు.
'లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా విజయ్ దేవరకొండలపై (Vijay Devarakonda) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పొగడ్తల వర్షం కురిపించారు. తనకు ఇష్టమైన హీరోల్లో విజయ్ ఒకరని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'లక్కీ భాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ త్రివిక్రమ్‌తోపాటు విజయ్ దేవరకొండ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ (Trivikram) మాట్లాడుతూ "విజయ్ దేవరకొండ నాకు బాగా ఇష్టమైన నటుల్లో ఒకరు. సినిమాల్లోకి వచ్చాక ఎంతో ప్రేమను చూశాడు.. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. చాలా గట్టోడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత రాశారు. 'మా వాడే మహా గట్టివాడే' అని రాశారు. మా విజయ్ మహా గట్టోడు, ఏం భయంలేదు. ఇక దుల్కర్‌ని పెద్దగా కలవలేదు. షూటింగ్ కి వెళ్ళడం కంటే, ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూడటానికి ఇష్టపడతాను. సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను. ఇండియన్ సినిమాకి మలయాళం సినిమా ఒక కొత్త యాంగిల్ క్రియేట్ చేసింది. అలాంటి ఒక న్యూ వేవ్ మలయాళం సినిమాలో ఒక మైల్ స్టోన్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమా నాగవంశీ, వెంకీకి మంచి విజయాన్ని అందించాలి’’ అని అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నా సోదరుడు దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉంది. పెళ్లిచూపులు హిట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచే. త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్‌కి పిలిపించి, కూర్చోబెట్టి నాతో మాట్లాడి ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఏడేళ్లవుతుంది అనుకుంటా. చాలారోజులు పట్టింది సినిమా చేయడం. ువిజయ్ దేవరకొండ12’ నేను, గౌతమ్ సితారలో చేయాలని రాసిపెట్టుందేమో. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం నా లైఫ్‌లో ఒక బిగ్ మూమెంట్. మన జనరేషన్ కి తెలుసు. మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జల్సా, నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా. అలాంటి సినిమాలు చేసిన ఆయన మనల్ని ఆఫీస్ కూర్చోబెట్టి నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే.. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆయన నా అభిమాన దర్శకుల్లో ఒకరు. సినిమా గురించి, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి ఆయన చెప్తుంటే వింటూ కూర్చోవచ్చు’’ అని అన్నారు.
READ ALSO: Lucky Bhaskar: తడిసిన కళ్ళతో.. నవ్వుతున్న పెదాలతో..
ఈ చిత్రం విషయానికొస్తే ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్స్ లో ఒకటి. లక్కీ భాస్కర్ తో వెంకీ ఒక కొత్త లెవెల్ అన్ లాక్ చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. మీనాక్షి చౌదరికి కూడా ఇందులో మంచి దొరికిందని అర్థమవుతోంది’’ అని అన్నారు.