NBK 109: బాలయ్య కోసం రెండు టైటిళ్లు..

ABN , Publish Date - Oct 13 , 2024 | 06:46 PM

నందమూరి బాలకృష్ణ (NBK109), బాబి (Bobby Kolli) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ చిత్రం  టైటిల్‌ అనౌన్స్‌ చేస్తారని అభిమానులు ఎదరుచూశారు.

నందమూరి బాలకృష్ణ (NBK109), బాబి (Bobby Kolli) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ చిత్రం  టైటిల్‌ అనౌన్స్‌ చేస్తారని అభిమానులు ఎదరుచూశారు. కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడీ చిత్రం టైటిల్‌ తెలుసుకోవాలంటే దీపావళి వరకూ ఆగాల్సిందే. దీపావళి సందర్భంగా టీజర్‌ విడుదల చేయడంతో పాటు, టైటిల్‌ కూడా రివీల్‌ చేయబోతున్నారు మేకర్స్‌. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్థమైంది. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్‌ ఎక్కువ. ఈ మధ్య ప్రతీ సంక్రాంతికి బాలయ్య నుంచి ఓ సినిమా రావడం, అది హిట్టవడం చూస్తున్నాం. ఇప్పటి దాకా ప్రకటన రాకపోయినా ఈ సంక్రాంతి బరిలో బాలయ్య ఉంటారనే టాక్‌ వినిపిస్తుంది. జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేేస అవకాశం ఉంది. రిలీజ్‌ డేట్‌ను కూడా దీపావళికి ప్రకటిస్తారని తెలుస్తోంది. 


అయితే ఈ చిత్రం కోసం రెండు టైటిళ్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘డాకూ మహారాజా’ (Daaku Maharaja), ‘సర్కార్‌ సీతారామ్‌’ (Sarkar Sitharam) ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్‌ చేేస అవకాశాలున్నాయని సన్నిహితుల నుంచి సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య బంధిపోటు తరహా పాత్ర పోషిస్తున్నారు. అందుకే డాకూ మహారాజా టైటిల్‌ను ఫైనల్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ టైటిల్‌ క్లాస్‌కి కనెక్ట్‌ కాదనుకుంటే సర్కార్‌ సీతారామ్‌’కి సై అనే ఛాన్స్‌ ఉంది. ఈ రెండింటిలో ఏ టైటిల్‌ ఫిక్స్‌ చేశారన్నది దీపావళికి తెలుస్తుంది. ఈ టాక్‌ బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు అయితే డాకూ మహారాజానే బాగుందని ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. 

Updated Date - Oct 13 , 2024 | 06:46 PM