Unstoppable 4: బాలయ్య విత్ బాబు.. వా.. క్యా సీన్ హై

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:28 PM

ఎపిసోడ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ షూటింగ్ నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఇంతకీ ఈ షో ఎలా కొనసాగిందంటే..

balayya with CBN

'ఆహా' ( Aha) ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) షో నాలుగో సీజన్‌కు చేరుకుంది. నందమూరి బాలకృష్ణ ( Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న ఈ షో మొదటి ఎపిసోడ్ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన షో ట్రైలర్ ఆడియెన్స్‌లో ఇప్పటి వరకు లేనంత బజ్ క్రియేట్ చేసింది. అయితే అల్లు అర్జున్‌తో ఇప్పటికే ఒక ఎపిసోడ్ షూట్ చేసిన టీమ్ ఆ ఎపిసోడ్‌ని డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. కాగా ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ షూటింగ్ నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఇంతకీ ఈ షో ఎలా కొనసాగిందంటే..


Balayya.jpg

ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2లో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎపిసోడ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా అప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఈ సారి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ ఎపిసోడ్ షూటింగ్ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్‌లో ఆగష్టు నెలలో టీడీపీలో ఏర్పడిన సంక్షోభం గురించి, ఎన్నికల్లో విజయం గురించి ప్రస్తావనతో పాటు చంద్రబాబు పలు టాస్క్‌లు ఆడనున్నారు.

Also Read- Ani Master: జానీ నిరపరాధి అని తేలితే ఏం చేస్తారు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 20 , 2024 | 04:13 PM