Balakrishna: బాలయ్యపై మరో బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
ABN , Publish Date - Oct 26 , 2024 | 01:46 PM
నందమూరి బాలకృష్ణపై మరో బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ చేసింది. దీంతో ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బీకే 109, ఎన్బీకే 110 సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ సీజన్ 4తో ట్రెండింగ్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఎన్బీకే 109 విడుదల కానుంది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల, పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. అయితే టాలీవుడ్లో బాలయ్యపై కామెంట్ చేసేందుకు ఎవరైనా వెనకడుగేస్తునారు. కానీ.. బాలీవుడ్లో రెండోసారి బాలయ్య హీరోయిన్ ఆయనపై కామెంట్ చేసింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇంతకీ ఏమైందంటే..
గతంలో బాలయ్యతో లెజెండ్, లయన్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల బాలయ్య ఏజ్‌పై కామెంట్ చేసింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "నేను బాబీ డియోల్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్న.. అతనికి నాకు ఏజ్ గ్యాప్ 37 సంవత్సరాలు. ఇక తెలుగులో బాలకృష్ణ ఎన్బీకే 109లో హీరోయిన్గా నటిస్తున్న.. ఆయనకు నాకు ఎంత ఏజ్ గ్యాపో నాకు తెలీదు, ఇండస్ట్రీలో ఇంత ఏజ్ గ్యాప్ క్యారెక్టర్లు చేస్తూ.. స్టీరియో టైప్స్ బ్రేక్ చేస్తున్న" అంది. అయితే బాబీ ఏజ్ 67, బాలయ్య ఏజ్ 64 అండ్ ఊర్వశి ఏజ్ 30. కానీ.. బాబీ కంటే బాలయ్య ఏజ్ ఎక్కువ అనే తరహాలో ఆమె మాట్లాడటం బాలయ్య అభిమానులకి చిరాకు తెప్పిస్తుంది.
మరోవైపు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. గతంలో ఈ చిత్రం కోసం రెండు టైటిళ్లు పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ‘డాకూ మహారాజా’ (Daaku Maharaja), ‘సర్కార్ సీతారామ్’ (Sarkar Sitharam) ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్ చేేస అవకాశాలున్నాయని సన్నిహితుల సమాచారం అన్నారు. ఈ చిత్రంలో బాలయ్య బంధిపోటు తరహా పాత్ర పోషిస్తున్నారు. అందుకే డాకూ మహారాజా టైటిల్‌ను ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ టైటిల్ క్లాస్‌కి కనెక్ట్ కాదనుకుంటే సర్కార్ సీతారామ్’కి సై అనే ఛాన్స్ ఉంది. ఈ రెండింటిలో ఏ టైటిల్ ఫిక్స్ చేశారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ టాక్ బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు అయితే డాకూ మహారాజానే బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.