Chaari 111: హీరోగా వెన్నెల కిశోర్.. మార్చి 1న థియేటర్లలోకి సినిమా
ABN , Publish Date - Feb 08 , 2024 | 03:28 PM
'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా చారి 111. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటించగా, మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) హీరోగా నటిస్తున్న సినిమా చారి 111 (Chaari 111). టీజీ కీర్తి కుమార్ (TG Keerthi Kumar) దర్శకుడు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ (Barkat Studios) పతాకంపై అదితి సోనీ (Aditi Soni) నిర్మించారు. సంయుక్తా విశ్వనాథన్ (Samyuktha V) కథానాయికగా నటించగా, మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.
చారి 111 (Chaari 111) రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా డిజైన్ చేశారు. థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) వస్తున్నట్లు ఉంది. ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి.
చారి 111 (Chaari 111) ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్‌ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా 'చారి' పాత్రలో వెన్నెల కిశోర్ (Vennela Kishore) కనిపిస్తారని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమా తీశామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ''ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్ (Vennela Kishore), సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారు. వాళ్లకు బాస్ రోల్ మురళీ శర్మ చేశారు. కథలో ఆయనది కీలక పాత్ర'' అని చెప్పారు.
చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ''స్పై జానర్ సినిమాల్లో చారి 111 (Chaari 111) కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అతి త్వరలో ట్రైలర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా చారి 111 (Chaari 111) పాటలు విడుదల కానున్నాయి.