Jitender Reddy: 1980’s నిజంగా జ‌రిగిన రాజ‌కీయాల నేప‌థ్యంలో ‘జితేందర్ రెడ్డి’.. ట్రైల‌ర్‌కు అనూహ్య స్పందన

ABN , Publish Date - May 03 , 2024 | 01:34 PM

1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి. రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

 Jitender Reddy: 1980’s నిజంగా జ‌రిగిన రాజ‌కీయాల నేప‌థ్యంలో ‘జితేందర్ రెడ్డి’.. ట్రైల‌ర్‌కు అనూహ్య స్పందన
jithender reddy

ముదుగంటి క్రియేషన్స్ (Muduganti Creations) పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ (Virinchi Varma) దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె (Rakesh Varre) లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి (Jitender Reddy).

Jithender-Reddy.jpg

1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్ (Riya Suman), చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.


చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి (Jitender Reddy), సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకు దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దౌర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్ మధ్య‌లో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి.

1980’s ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి కంటెంట్ మాత్రం ప్రోమిసింగ్ గా ఉంది, మే 10న ‘జితేందర్ రెడ్డి (Jitender Reddy) విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపారు. లవ్ స్టోరీస్ డైరెక్ట్ చేసిన విరించి వర్మ ఇలాంటి ఒక యాక్షన్ సినిమా చేసారా అంటే అస్సలు నమ్మేలా లేదు, విరించి దర్శకత్వంలో మరో కోణం ఈ జితేందర్ రెడ్డితో భయటకి వస్తుందేమో చూడాలి.

Updated Date - May 03 , 2024 | 01:34 PM