Vishwak Sen: వారిని చూస్తే..ఈ నగరానికి ఏమైంది సినిమా రోజులు గుర్తొస్తున్నాయి

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:23 PM

ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. తాజాగా ఈ చిత్రంలోని గలీజ్‌ సాంగ్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. విశ్వక్‌సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Roti Kapda Romance

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా (Lucky Media) అధినేత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venu Gopal).. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapda Romance). హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్రంలోని గలీజ్‌ సాంగ్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్‌కాదాస్‌ విశ్వక్‌సేన్ (Vishwak Sen) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

GSlIMofbIAEDi7e.jpeg

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venu Gopal) మాట్లాడుతూ విశ్వక్ (Vishwak Sen) మాకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటాడు. కొత్తవాళ్లను చాలా మందిని విశ్వక్‌ ఎంతో హెల్ప్‌ చేస్తున్నాడు. ఎదో ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను తీశాం. దర్శకుడు విక్రమ్‌ రెడ్డి ఎంతో ప్రతిభావంతంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల యూత్‌కు షో వేశాం. వాళ్ల ఫీడ్‌బ్యాక్‌తో మాలో మరింత కాన్ఫిడెంట్ వచ్చింది. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుంది. రాహుల్‌ గలీజ్‌ సాంగ్‌ను ఎంతో బాగా పాడాడు. ఈ రోజు విశ్వక్‌ ఈ కార్యక్రమానికి వచ్చి సపోర్ట్‌ చేసినందుక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామ‌ని, ఈ చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామ‌న్నారు.


GSlIMoebIAAcWbD.jpeg

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ కుమార్ బొజ్జం మట్లాడుతూ ఇటీవల ప్రివ్యూ వేశాం. సినిమా అందరికి బాగా నచ్చింది. సినిమాలో ఈ గలీజ్‌ సాంగ్‌ను చూసిన వాళ్లంతా ఈ పాట‌ను విడుదల చేయమని కోరారు. అందరి కోరిక మేరకు ఈ రోజు విశ్వక్‌సేన్‌ చేతుల మీదుగా ఈ సాంగ్‌ను విడుదల చేశాం. తప్పకుండా చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు విక్రమ్‌ రెడ్డి (Vikram reddy) మాట్లాడుతూ 'సినిమా విజయంపై చాలా విశ్వాసంతో ఉన్నాం. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసే మనసు విశ్వ‌క్‌కు ఉంది. అందుకే అతను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాడు. మా సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అది ఏ రేంజ్‌ అనేది ఆడియన్స్‌ చేతిలో ఉంద‌న్నారు. సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్‌ చిత్రంలో ఉంటాయ‌న్నారు.

విశ్వక్‌సేన్ (Vishwak Sen) మాట్లాడుతూ నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు మంచి టేస్ట్ ఉంది. లవ్ స్టోరీస్‌ మీద మంచి జడ్డిమెంట్ ఉంది. ప్రతి సినిమాను ఎంతో పాషన్‌తో నిర్మిస్తాడు. ఈ సినిమా టీమ్‌ను, హీరోలను చూస్తుంటే నాకు ఈ నగరానికి ఏమైంది రోజులు గుర్తొస్తున్నాయి. హీరోలు, హీరోయిన్స్‌ చక్కగా ఉన్నారు. ఈ సినిమా విజయం సాధించి టీమ్‌ అందరికి మంచి పేరు తీసుకరావాలి. ఈ సినిమాను థియేటర్‌లో అందరూ చూడాలి. నిర్మాతలకు మంచి వసూళ్లు రావాలని కోరుకుంటున్నా అన్నారు. కార్యక్రమంలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 07:24 PM