Vishwak Sen: రెట్టింపు వెనక్కి ఇచ్చేశా.. ఆయన వల్ల నష్టపోయింది నేనే!
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:22 AM
విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా అర్జున్ 9arjun sarja) దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్యా అర్జున్ కథానాయికగా ఓ సినిమా మొదలై ఆగిపోయిన విషయం తెలిసిందే! ఆ కారణంగా ఓ ప్రెస్మీట్ పెట్టి విశ్వక్ కమిట్మెంట్ లేని నటుడని అర్జున్ ఆరోపించడం చర్చనీయాంశమైంది.
విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా అర్జున్ 9arjun sarja) దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్యా అర్జున్ కథానాయికగా ఓ సినిమా మొదలై ఆగిపోయిన విషయం తెలిసిందే! ఆ కారణంగా ఓ ప్రెస్మీట్ పెట్టి విశ్వక్ కమిట్మెంట్ లేని నటుడని అర్జున్ ఆరోపించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై విశ్వక్ సేన్ స్పందించారు.
‘‘సినిమా నేపథ్యం ఉన్న హీరోకి ఇలా జరిగితే ఎలా ఉండేది? నేను ఆ సినిమాని క్యాన్సిల్ చేయమని చెప్పలేదు. ఒక్కరోజు షూటింగ్ ఆపమన్నానంతే. దానికే ఆయన మా ఇంటికొచ్చి అమ్మ, నాన్నలకు విజ్ఞప్తి చేయడం లాంటివి ఎన్నో జరిగాయి. అవి ఎవరికీ తెలియదు. నాకు సినీ నేపథ్యం లేదనో, ఇంకేదో అనుకుని ప్రెస్మీట్ పెట్టారు. కానీ, నేను ఆ విషయాన్ని సాగదీయాలనుకోలేదు. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న పారితోషికానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశా. ఆయన కోపంలో చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే’’ అని అన్నారు.
‘సవారి’ చిత్రం గురించి మాట్లాడుతూ "ఫస్టాఫ్ కథ పూర్తయిందని, సెకండాఫ్ విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఆ సినిమా ప్రారంభం లేట్ అయింది. తప్పకుండా ఆ చిత్రంలో నటిస్తా. కాలేజీ నేపథ్యంలో ఆ కథ సాగుతుంది’’ అని అన్నారు.
విశ్వక్ సేన్ (Vishwak sen)నటించిన ‘గామి’ (Gaami) చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. విద్యాధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విశ్వక్.. అఘోరాగా కనిపించనున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. 1990ల నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకుడు. నేహా శెట్టి కథానాయిక.