Suhas: లెక్కతప్పిన సుహాస్.. నెక్స్ట్ ఏంటి?
ABN , Publish Date - Oct 16 , 2024 | 01:22 PM
అద్భుతమైన నటనతో అదరొగొడుతున్న సుహాస్‌కి 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణం' సినిమాలు మాత్రమే కమర్షిషియల్ హిట్లు అందించాయి. మిగతా సినిమాలన్నీ పర్వాలేదనిపించాయి. రీసెంట్‌గా రిలీజైన 'జనక అయితే గనక' సినిమా కూడా ఇదే లిస్ట్‌లోకి వెళ్ళింది. ఇంతకీ సుహాస్ సినిమాల రిజల్ట్స్‌లో వ్యత్యాసం ఎక్కడొస్తుందంటే..
టాలీవుడ్‌లో ఉన్న యంగ్ యాక్టర్స్‌లో సుహాస్(Suhas) నటన అందరికంటే వైవిధ్యమైనది. కెరీర్ ఆరంభం నుండే విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అయితే నటనతో అదరొగొడుతున్న సుహాస్‌కి 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణం' సినిమాలు మాత్రమే కమర్షిషియల్ హిట్లు అందించాయి. మిగతా సినిమాలన్నీ పర్వాలేదనిపించాయి. రీసెంట్‌గా రిలీజైన 'జనక అయితే గనక' (Janaka Aithe Ganaka) సినిమా కూడా ఇదే లిస్ట్‌లోకి వెళ్ళింది. ఇంతకీ సుహాస్ సినిమాల రిజల్ట్స్‌లో వ్యత్యాసం ఎక్కడొస్తుందంటే..
అద్భుతమైన నటన అంతకు మించిన కథ.. ఇది కేవలం సుహాస్ 'జనక అయితే గనక' సినిమా విషయం మాత్రమే కాదు, ఆయన నటించిన అన్ని సినిమాల వ్యవహారం. ఇంకేంటి అన్ని హిట్స్ ఆ.. అంటే కాదు.. నటన బాగాలేకున్నా, యాక్టింగ్ బాగాలేకున్నా ఎదో ఒక లోపం ఉన్న సూపర్ హిట్ అయిన సినిమాలు కోకొల్లలు. కానీ.. అన్ని బాగానే ఉన్న సుహాస్‌కి మాత్రం లక్ కలిసి రావడం లేదు. జనక అయితే గనక సినిమా మరో 'బలగం' లేదా 'బొమ్మరిల్లు' అవుతుందన్న సుహాస్ లెక్కలు ఫలించలేదు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అండా ఉపయోగపడలేదు. మరోవైపు ఫారెన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా సుహాస్ సొంతం చేసుకున్న ఆశించినా స్థాయిలో రిజల్ట్స్ కనిపించలేదు.
కథలో బలం ఉన్న, నటనలో సామర్థ్యం ఉన్న సినిమాని తెరకెక్కించే విధానంలో డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు. దీంతో సుహాస్ కి యావరేజ్ అండ్ ఫ్లాప్ రిజల్ట్స్ ఎదురైతున్నాయి.' ప్రసన్నవదనం', 'గొర్రె పురాణం', 'శ్రీరంగనీతులు' ఇలా ఒక్కో సినిమాలో క్యారెక్టర్ లెంగ్త్, బ్యాక్ డ్రాప్ కూడా పట్టించుకోకుండా సుహాస్ వైవిద్యభరితమైన రోల్స్‌లో ప్రయోగాలు చేస్తున్న నిరాశ తప్పడంలేదు. ఇక అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ 'కేబుల్ రెడ్డి', 'ఆనందరావు అడ్వెంచర్స్', 'ఉప్పు కప్పురంబు' సినిమాలతో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో వేచి చూడాల్సి ఉంది.