Ram Mandir: ప్రభాస్‌.. తారక్‌ ఎందుకు వెళ్లలేకపోయారంటే..

ABN , Publish Date - Jan 23 , 2024 | 03:18 PM

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ (ayodhya ram mandir) క్రతువు రామనామ స్మరణ మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి సినీ స్టార్లు అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడిని దర్శించుకుని ఆధ్యాత్మిక భావనలో పులకించిపోయారు.

Ram Mandir:  ప్రభాస్‌.. తారక్‌ ఎందుకు వెళ్లలేకపోయారంటే..

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ (ayodhya ram mandir) క్రతువు రామనామ స్మరణ మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి సినీ స్టార్లు అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడిని దర్శించుకుని ఆధ్యాత్మిక భావనలో పులకించిపోయారు. మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ, రామ్‌ చరణ్‌, రజనీకాంత్, ధనుష్‌, అమితాబ్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌, అనుపమ్‌ఖేర్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ తదితరులు శ్రీరామ ప్రతిష్ఠ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందినా అనివార్య కారణాల వల్ల కొందరు నటీనటులు వెళ్లలేకపోయారు.

జూ. ఎన్టీఆర్‌కు( Jr NTR) కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. కానీ ఆయన వెళ్లలేకపోయాడు. 'దేవర’ షూటింగ్‌తో బిజీగా ఉండటమే కారణమని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దేవర సినిమా మేజర్‌ షెడ్యూల్‌ను ముందుగానే చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసింది. భారీ సెట్‌లో మేజర్‌ యాక్షన్  పార్ట్‌ ప్లాన్  చేయడం, ఆ షెడ్యూల్‌లో వందల మంది పాల్గొనున్నార. ఆ షూటింగ్‌ ఆగిపోతే నిర్మాతలు ఇబ్బంది పడతారని భావించారట. అందుకే ఆయన అయోధ్యకు వెళ్లలేక పోయారని టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా సైఫ్‌ అలీఖాన్‌కు గాయం కావడంతో ఆస్పత్రిలో చేరడం. ఆ విషయం తారక్‌కు, దేవర యూనిట్‌కు కాస్త ఆలస్యంగా తెలియడంతో చివరి నిమిషంలో తారక్‌ అయోధ్య ట్రిప్‌ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. 

'ఆదిపురుష్‌’ చిత్రంలో రాఘవ పాత్ర పోషించిన ప్రభాస్‌కు (Prabhas) కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. ఆయన కూడా వెళ్లలేకపోయారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్‌ సినిమాతో పాటు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తున్న కల్కి సినిమా షూటింగ్‌ పనిలో ప్రభాస్‌ బిజీగా ఉన్నారట. మారుతి సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ, మరోపక్క కల్కిలో  కీలక ఘట్టాలను తెరకెక్కించే పనులు ఉండడంతో ప్రభాస్‌ కూడా రామమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయారు. 

Updated Date - Jan 23 , 2024 | 03:35 PM