Dakshina: నాడు ‘మంత్ర, మంగళ’ నేడు సైకో థ్రిల్లర్! ఓషో తులసీరామ్ మళ్లీ హిట్ కొడతాడా
ABN , Publish Date - Sep 30 , 2024 | 10:09 PM
దశాబ్దంన్నర క్రితం‘మంత్ర, మంగళ’ వంటి హర్రర్, థ్రిల్లర్ జానర్ చిత్రాలతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్లీ ఇన్నాళ్లకు ‘దక్షిణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
దశాబ్దంన్నర క్రితం‘మంత్ర, మంగళ’ వంటి హర్రర్, థ్రిల్లర్ జానర్ చిత్రాలతో సంచలనం సృష్టించడమే కాక తెలుగులో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ (Director Osho Tulasiram). మళ్లీ దాదాపు 15, 16 యేండ్ల తర్వాత ఆయన ‘దక్షిణ’ (Dakshina) మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక (Sai Dhansika) కథానాయికగా నటిస్తోండగా మరో ముఖ్య పాత్రలో రిషబ్ బసు నటించింది. ఆక్టోబర్‌లో ప్రేక్షకుల ముందదుకు రానుంది. ఈక్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేయగా ఈ‘దక్షిణ’ సినిమాను అక్టోబర్ 4న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇటీవల తెలియజేశారు. థ్రిల్లింగ్ సినిమాలకు సరికొత్త నిర్వచనంగా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఈవెంట్ నిర్వహించి మూవీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌ను చూస్తుంటే గూస్‌బంప్స్ రావడమే కాక ఇప్పటి వరకు వచ్చిన మర్డర్ మిస్టరీ, సైకో థిల్లర్ మూవీల్లా కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపేలా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ లుక్ మంత్ర, మంగళ సినిమాల మాదిరే రా అండ్ రస్టిక్‌గా చాలా రఫ్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ‘దక్షిణ’తో మళ్లీ ఓషో తులసీరామ్ గత సినిమాల వలే టాలీవుడ్‌కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్‌ని ఇవ్వబోతున్నాడనేలా ఉంది.
అక్టోబర్ 4న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని, నైజాంలో ఈ సినిమాను మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని నిర్మాత అశోక్ షిండే తెలిపారు. సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ, ఆర్నా ములెర్, మేఘన చౌదరి, నవీన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి బాలాజీ సంగీతం అందించారు.