Ghatikachalam Teaser: ‘ఘటికాచలం’ టీజర్ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Oct 14 , 2024 | 02:08 PM

నిఖిల్ దేవాదుల కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఘటికాచలం’. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి అమర్ కామెపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.సి రాజు నిర్మాత.  దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా  సోమవారం  చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. మీరు ఓ లుక్కేయండి.. 

Updated at - Oct 14 , 2024 | 02:12 PM