Janaka Aithe Ganaka: ‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Oct 09 , 2024 | 01:47 PM

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకుడు. ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12న విడుద‌లయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ మరో ట్రైలర్‌ను.. ‘రిలీజ్ ట్రైలర్’ పేరుతో విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది.

Updated at - Oct 09 , 2024 | 01:47 PM