Appudo Ippudo Eppudo: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ టీజర్

ABN, Publish Date - Oct 11 , 2024 | 04:21 PM

‘కార్తికేయ 2’ చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. నిఖిల్ హీరోగా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. ‘స్వామి రారా, కేశవ’ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరా స్పెషల్‌గా ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

Updated at - Oct 11 , 2024 | 04:21 PM