Swag: స్టోరీ ఆఫ్ ది టైటిల్ ‘స్వాగ్’

ABN, Publish Date - Feb 29 , 2024 | 02:36 PM

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి ఫస్ట్ కొలాబరేషన్‌లో వచ్చిన ‘రాజ రాజ చోర’ చిత్రం నవ్వుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించబోయే కొత్త చిత్రం కోసం మళ్లీ వీరు కలిశారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రొడక్షన్ నెం 32 చిత్రానికి ‘స్వాగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. స్టోరీ ఆఫ్ ది టైటిల్ ‘స్వాగ్’ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.