Mr.Celebrity: వరలక్ష్మీ శరత్ కుమార్.. లేటెస్ట్‌ థ్రిల్ల‌ర్ ‘మిస్టర్ సెలెబ్రిటీ’ టీజ‌ర్‌

ABN, Publish Date - Sep 03 , 2024 | 01:01 PM

పరుచూరి వెంకటేశ్వరరావు మ‌నుమ‌డు సుదర్శన్ పరుచూరి హీరోగా వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందించిన చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ‘రామాయణం కాలంలో చాకలి వాడు అన్న పుకార్ల మాటలకు సీతాదేవీ అరణ్య వాసం, అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది.. కాలం మారింది కానీ ఈ పుకారు మాటల వల్ల పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Updated at - Sep 03 , 2024 | 01:03 PM