Kasthuri: నోరు పారేసుకున్న నటి.. కామెంట్స్‌పై క్లారిటీ

ABN , Publish Date - Nov 04 , 2024 | 01:39 PM

నటి 'కస్తూరి' తెలుగు వారిపై చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలుగు వారిని అవమానిస్తూ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె చేసిన పనికి తెలుగు ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు కూడా ఊగిపోతున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

తాజాగా సీనియర్ తమిళ నటి, బీజేపీ నేత కస్తూరి తెలుగు వారిని అవమానిస్తూ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో ఆమె ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చే పని చేశారు. ఆమె తెలుగు మీడియాను, తెలుగు ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ వరుస ట్వీట్లు పెట్టారు. అయినా ఆమె చేసిన పనికి తెలుగు ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు కూడా ఊగిపోతున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..


నటి 'కస్తూరి' తెలుగు వారిపై చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన 'X' ఖాతా ద్వారా వరుస పోస్టులు చేశారు. " ఏపీ, తెలంగాణ ప్రజలారా.. డీఎంకే పార్టీ వక్రీకరించిన నా స్పీచ్ ని నమ్మకండి, నాకు తెలుగు ప్రజలంటే ఎంతో ప్రేమ, గౌరవం" అన్నారు. మరొక ట్వీట్ చేస్తూ.. " నా మెట్టిలు తెలుగు, నా ఫ్యామిలీ తెలుగు అని తెలియక కొంతమంది ఇడియట్స్ కామెడీ చేస్తున్నారు. కొంతమంది యాంటీ హిందువులు తమ అబద్దాలతో సనాతన లీడర్లైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలను ట్యాగ్ చేసి ఎం చేయగలరు" అన్నారు. ఇక మూడో ట్వీట్ లో " తమిళుల మధ్య విభజన ద్వేషపూరిత రాజకీయాలు సృష్టిస్తున్న కొందరు మోసపూరిత ద్రావిడ నాయకులు తమ ద్వంద వైఖరితో నేను తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ ఫేక్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు" అంటూ రాసుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ ఆమె ఒరిజినల్ స్పీచ్ ని పెద్దగా వక్రీకరించనట్లు ఎం కనపడటం లేదని చాలా మంది తెలుగు ప్రజలు ఆమెపై ఫైర్ అవుతున్నారు. తెలుగు వాళ్ళకి తోడుగా మరికొందరు తమిళులు మద్దతు తెలుపుతున్నారు.



ఆమె తన స్పీచ్‌లో ఎం మాట్లాడారంటే..

తమిళనాడు రాజకీయాల్లో ద్రావిడ సిద్ధాంతాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిద్ధాంతం ప్రకారం బ్రాహ్మణులూ.. తమిళులు కాదని వాదన. అయితే ఈ వాదనలను విమర్శిస్తూ నటి కస్తూరి.. "రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తెలుగు జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ" మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు చిచ్చురేపుతున్నాయి. అలాగే "ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని" కస్తూరి ఆరోపించారు

Updated Date - Nov 04 , 2024 | 01:45 PM