HANUMAN: హ‌నుమాన్ వీర విహారం.. ఆకాశానికెత్తేస్తున్న తమిళ, మళయాళ, కన్నడ హీరోలు

ABN , Publish Date - Jan 16 , 2024 | 09:54 PM

ఏ ముహుర్తానా ప్రశాంత్ వర్మ ఈ సినిమాను పట్టుబట్టి జనవరి 12న హనుమాన్ చిత్రాన్ని విడుదల చేశాడో గానీ సినిమా విడుదలైన మరుక్షణం నుంచి ప్రపంచవ్యాప్తగా అప్రతిహతంగా దూసుకెళుతూ మరోసారి తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.

HANUMAN: హ‌నుమాన్ వీర విహారం.. ఆకాశానికెత్తేస్తున్న తమిళ, మళయాళ, కన్నడ  హీరోలు
HANU MAN

ప్రశాంత్ వర్మ ఏ ముహుర్తానా పట్టుబట్టి హనుమాన్ (Hanuman) చిత్రాన్ని జనవరి 12న విడుదల చేశాడో గానీ సినిమా విడుదలైన మరుక్షణం నుంచి ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా దూసుకెళుతూ మరోసారి తెలుగోడి సత్తాను వెలుగెత్తి చాటేలా చేస్తుంది. సినిమాను చూసిన వారు ఆకాశానికెత్తెస్తూ.. నటుల యాక్టింగ్‌కు, దర్శకుని ప్రతిభకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటున్నారు.


సినిమా విడుదలైన రెండు రోజులు 2 తెలుగు రాష్ట్రాలలోని హనుమాన్ (Hanuman Movie) సినిమా నడుస్తున్న థియేటర్లు నిండిపోగా నెమ్మదిగా ఇప్పుడు ఇది బాలీవుడ్ తో పాటు మిగతా రాష్ట్రాలకు చేరింది. దీంతో టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో, ఓవర్సీస్ లలో బాహుబలి, RRRలను బీట్ చేస్తూ రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రిలీజైన నాలుగు రోజుల్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.


తాజాగా ఈ సినిమాను కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్ కూమార్, రిషబ్ షెట్టి, ధనుంజయ.. తమిళ ఇండస్ట్రీ నుంచి రాధిక, శరత్ కుమార్.. బాలీవుడ్ నుంచి మాధవన్, వివేక్ అగ్నిహోత్రి.. మ‌ళ‌యాళ ప‌రిశ్ర‌మ నుంచి ఉన్ని ముకుంద‌న్.. టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, రవితేజ, రామ్ పోతినేని, మంచు విష్ణు, నారా రోహిత్, గోపీచంద్, , ఆర్జీవీ, సాయిధరమ్ తేజ్, నాని, వరుణ్ తేజ్, రాఘవేంద్రరావు వంటి హీరోలు, దర్శకులు చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలకృష్ణ ప్రత్యేకంగా షో వేయించుకుని మరి సినిమా తిలకించి ప్రశాంత్ వర్మను పొగడ్తల్లో ముంచెత్తారు.

Updated Date - Jan 17 , 2024 | 10:24 AM