Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:02 PM

అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి‌ల 13వ పెళ్లి రోజు నేడు (బుధవారం). ఈ సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి రోజును పురస్కరించుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా ‘నేను ఇంత గొప్పగా మారడానికి నీతో బంధమే కారణం’ ఎమోషనల్‌గా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ పోస్ట్‌తో పాటు ఆయన షేర్ చేసిన ఫొటోలు కూడా టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారాయి.

Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్
Allu Arjun and Allu Sneha Reddy

అల్లు అర్జున్ (Allu Arjun), అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy)‌ల 13వ పెళ్లి రోజు నేడు (బుధవారం). ఈ సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి రోజును పురస్కరించుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) కూడా సోషల్ మీడియా వేదికగా ‘నేను ఇంత గొప్పగా మారడానికి నీతో బంధమే కారణం’ అని ఎమోషనల్‌గా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ పోస్ట్‌తో పాటు ఆయన షేర్ చేసిన ఫొటోలు కూడా టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారాయి. (Allu Arjun 13th Wedding Anniversary Post)

అల్లు అర్జున్ (#AlluArjun), అల్లు స్నేహారెడ్డి‌ (#AlluSnehaReddy)ల వివాహం 2011లో జరుగగా.. వారికి అల్లు అయాన్, అల్లు అర్హ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా ‘గంగోత్రి’ సినిమాతో పరిచయమై.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ‘పుష్ప’ సినిమాలోని ఆయన నటనకు ప్రపంచమే నీరాజనాలు పలికింది. ఫలితంగా టాలీవుడ్‌కి ఇప్పటి వరకు రాని, లేని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ను అల్లు అర్జున్ సాధించిపెట్టారు. అయితే ఈ కీర్తి ప్రతిష్టలకు కారణం తన భార్య స్నేహారెడ్డితో ఉన్న బంధమే కారణమంటూ అల్లు అర్జున్ తన తాజా పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.


Allu-Sneha-Reddy.jpg

‘‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. మన పెళ్లి జరిగి 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. నా ఈ అభివృద్ధికి నీతో ఈ బంధమే కారణం. నీ ప్రశాంతతతో నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్.. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను..’’ అంటూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోని, అలాగే తన పెళ్లి నాటి మరో ఫొటోని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. అల్లు స్నేహారెడ్డి ఓ లవ్ సింబల్‌ని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలనే మళ్లీ పోస్ట్ చేస్తూ.. ‘హ్యాపీ యానివర్సరీ’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఈ క్యూట్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (Allu Arjun and Sneha Reddy 13th Wedding Anniversary)


ఇవి కూడా చదవండి:

====================

*Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్

**************************

*Aa Okkati Adakku: థమన్ వదిలిన ‘ఓహ్ మేడమ్’ సాంగ్

***********************

*RC16: అఫీషియల్.. రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్

**************************

*Nivetha Pethuraj: సీఎం కొడుకు రూ. 50 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చాడనే వార్తలపై నివేతా సీరియస్..

****************************

Updated Date - Mar 06 , 2024 | 01:04 PM