Arundhati: ‘అరుంధతి’కి ఒకటిన్నర దశాబ్దం

ABN , Publish Date - Jan 16 , 2024 | 05:32 PM

దర్శకమాంత్రికుడు కోడి రామకృష్ణ కెరీర్‌లో కలికితురాయిగా నిలిచిన ‘అరుంధతి’ చిత్రం ఒకటిన్నర దశాబ్దం పూర్తి చేసుకుంది. అప్పటివరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన అనుష్కలోని అభినయ సామర్ధ్యాన్ని వెలికి తీసి, ఆమె కెరీర్‌ను టర్న్ చేసిన చిత్రం ‘అరుంధతి’. అనంతర కాలంలో అనుష్క నటించిన ‘బాహుబలి, భాగమతి’ చిత్రాలకు బీజం వేసిన చిత్రంగానూ ‘అరుంధతి’ చిత్రాన్ని అభివర్ణించవచ్చు.

Arundhati: ‘అరుంధతి’కి ఒకటిన్నర దశాబ్దం
Anushka in Arundhati

దర్శకమాంత్రికుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) కెరీర్‌లో కలికితురాయిగా నిలిచిన ‘అరుంధతి’ (Arundhati) చిత్రం ఒకటిన్నర దశాబ్దం పూర్తి చేసుకుంది. అప్పటివరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన అనుష్క (Anushka)లోని అభినయ సామర్ధ్యాన్ని వెలికి తీసి, ఆమె కెరీర్‌ను టర్న్ చేసిన చిత్రం ‘అరుంధతి’. అనంతర కాలంలో అనుష్క నటించిన ‘బాహుబలి (Bahubali), భాగమతి (Bhagamathie)’ చిత్రాలకు బీజం వేసిన చిత్రంగానూ ‘అరుంధతి’ చిత్రాన్ని అభివర్ణించవచ్చు. ‘అరుంధతి, జేజెమ్మ’ పాత్రలలో అనుష్క కనబరిచిన అభినయం.. ఆబాలగోపాలాన్ని అలరించి.. ఒక మైల్‌స్టోన్‌ మూవీగా ఆమె కెరీర్‌లో నిలబడింది.

Sonu-Sood.jpg

తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శక మాంత్రికుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్ర రాజం విడుదలై నేటికి (జనవరి 16) ఒకటిన్నర దశాబ్దం గడిచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న ‘అరుంధతి’ సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు (2009, జనవరి 16) విడుదలై, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసింది. అనుష్కకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు సొంతమయ్యేలా చేసిన ‘అరుంధతి’... పశుపతి (Pasupati)గా మెప్పించిన సోనూ సూద్‌ (Sonu Sood)కు ఉత్తమ విలన్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్‌కు ఉత్తమ కళా దర్శకుడు అవార్డులు తెచ్చిపెట్టింది.


Anushka.jpg

కోడి రామకృష్ణ దర్శకత్వంలో... రాజీ పడడం అన్నది ఎరుగని నిర్మాత ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి నేటి రాజమౌళి ఆస్థాన ఛాయాగ్రాహకుడు కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటి సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఇప్పటికీ ఇదే జానర్‌లో వస్తున్న కొన్ని చిత్రాలకు.. ఈ సినిమానే స్ఫూర్తి అంటే.. దర్శకుడు ఈ సినిమాని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క శెట్టి (Anushka Shetty) ట్విట్టర్ వేదికగా.. జేజెమ్మ పాత్ర తనని ప్రేక్షకుల హృదయాలకు దగ్గర చేసిందని చెబుతూ.. దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. (Arundhati Completes 15 Years)


ఇవి కూడా చదవండి:

====================

*HanuMan: ‘హను-మాన్’ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం

***************************

*Kanguva: ‘కంగువ’ సెకండ్ లుక్.. సూర్య ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

**************************

*Akira Nandan: పవన్ మిస్.. అయితేనేం పండగ వేళ ఆయన వారసుడి లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా!

*************************

*Naa Saami Ranga: మొదటి రోజు కంటే రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు..

**********************

*Mahesh Babu: ‘గుంటూరు కారం’ టీమ్‌కి మహేష్ గ్రాండ్ పార్టీ.. ఫొటోలు వైరల్

************************

Updated Date - Jan 16 , 2024 | 05:32 PM