Biggboss -8: బీబీ రాజ్యం చాలెంజ్‌ తర్వాత ఏం జరిగింది

ABN , Publish Date - Oct 26 , 2024 | 08:48 AM

తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ సోసో నడుస్తోంది. రెండు రోజులుగా సాగుతున్న బీబీ రాజ్యం చాలెంజ్‌ పూర్తయింది. రాయల్స్‌ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్‌ పాత కంటెస్టెంట్లు రాజ్యాన్ని కైవసం చేసుకుంది.


తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో (Biggboss 8) సీజన్‌ సోసో నడుస్తోంది. రెండు రోజులుగా సాగుతున్న బీబీ రాజ్యం చాలెంజ్‌ (BB Rahyam Challenge) పూర్తయింది. రాయల్స్‌ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్‌ (OG team) పాత కంటెస్టెంట్లు రాజ్యాన్ని కైవసం చేసుకుంది. అనుకోకుండా విష్ణుప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. ఎపిసోడ్‌లో ఏం జరిగాయంటే..బీబీ రాజ్యం చాలెంజ్‌లో భాగంగా ఎవరు తెలివైనవారు? అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ గేమ్‌కు నిఖిల్‌ సంచాలకుడిగా వ్యవహరించాడు. ‘13 హార్ట్స్‌ ఉంటాయి.. కానీ మిగతా ఆర్గాన్స్‌ ఉండవు.. ఏంటి?’ అన్న ప్రశ్నకు తేజ ప్లేయింగ్‌ కార్డ్స్‌ అని బదులిచ్చాడు. కొన్ని నెలలకు 31 రోజులు ఉంటాయి.  కొన్ని నెలలకు 30 రోజుల ఉంటాయి. ఎన్ని నెలకు 28 రోజులుంటాయన్న ప్రశ్నకు గౌతమ్‌ 12 నెలకు అని కరెక్ట్‌ ఆన్సర్‌ చెప్పాడు. ఏపీ, తెలంగాణ సరిహద్దులో విమానం పడిపోతే అందులో ఉన్న సర్వైవర్లను ఎక్కడ పూడ్చి పెడతారు? అని అడిగిన ప్రశ్నకు నిఖిల్‌, నయని.. ఆంధ్ర, తెలంగాణ అంటూ శుద్థ తప్పు సమాధానం చెప్పారు. బతికున్నవాళ్లను పాతిపెడతారా? అని బిగ్‌బాస్‌ కౌంటర్‌ వేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఇలాంటి ప్రశ్నలే మరికొన్ని వేయగా రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో చివరి ప్రశ్నగా.. కోతి, ఉడుత, పక్షిలో ఏది ముందుగా కొబ్బరిచెట్టు ఎక్కి అరటిపండు తెంచగలదు. ముందుగా బజర్‌ నొక్కిన ప్రేరణకు ప్రశ్న సరిగా అర్థం కాలేదు. ఆ క్వశ్చన్‌ రిపీట్‌ చేయడానికి వీల్లేదని తేజ వాదించాడు. కావాలంటే జంతువుల పేర్లను ఇంగ్లిష్‌లో చెప్పుకోవచ్చన్నాడు. దీంతో గంగవ్వ వచ్చి.. ప్రేరణకు ఎందుకు చెప్తున్నావు, నీకు ఆన్సర్‌ తెలుసా? అని తేజను కొట్టింది. ఇంతలో ప్రేరణ కొబ్బరి చెట్టుపై నుంచి పండును ఏ జంతువూ తెంపలేదని పేర్కొంది.

Aamir Khan: బయోపిక్‌ కోసం ఆమిర్‌ఖాన్‌ సై అన్నట్టేనా..

మా మధ్యకు రాకు...
అలా ఈ గేమ్‌లో ఓజీ గెలిచి బీబీ రాజ్యంలో స్కూల్‌, న్యాయస్థానాన్నిగ గెలుచుకుంది. అలాగే తన టీమ్‌లో ప్రేరణను కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్‌ టీమ్‌లో మెహబూబ్‌ను చీఫ్‌ కంటెండర్‌ పోస్టు నుంచి తప్పించారు. ఇంతలో గౌతమ్‌.. ప్రేరణతో ఏదో వాదులాటకు దిగగా మధ్యలో యష్మి వచ్చి ఆ గొడవను ఆపబోయింది. మా ఇద్దరి మధ్యకు రాకు..  వెళ్లిపో అని యష్మిపై అరిచాడు. కాసేపట్లో సారీ చెప్పాడు గౌతమ్‌.

నీకు నాకు సెట్‌ కాదు..
నిఖిల్‌, యష్మి మధ్య ఏదో నడుస్తూనే ఉంది. నీకు, నాకు సెట్‌ కాదు. ఎక్స్‌పెక్టేషన్‌ పెట్టుకోకు అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిఖిల్‌ ప్రవర్తన అంతుపట్టని యష్మి.. సడన్‌గా వచ్చి నాపై ఇంట్రస్ట్‌ ఉందన్నట్లు మాట్లాడతాడు. అలాగే నేను, గౌతమ్‌ డ్యాన్స్‌ చేేస్త జెలసీ ఫీల్‌ అవుతాడు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. కెమెరా ముందు మంచోడిలా ఉండాలనుకుంటే ఉండు.. నేను మాత్రం ఫేక్‌గా ఉండలేను అంది. అలా ఈర్ష్య పడటం లవ్‌ లాంగ్వేజ్‌ అని ప్రేరణ అభిప్రాయపడింది. ఇక బీబీ రాజ్యం టాస్కు పూర్తయిందన్న బిగ్‌బాస్‌.. ఓజీ, రాయల్స్‌ నుంచి చెరొక కంటెండర్‌ను సెలక్ట్‌ చేయవచ్చన్నాడు.

మిరప దండ వేసి

దీంతో విష్ణుప్రియ, తేజ ను ఎంపిక చేశారు. ప్రేరణ, నిఖిల్‌, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి, తేజలలో ఒకర్ని మెగా చీఫ్‌గా ఎన్నుకునే బాధ్యతను హౌస్‌మేట్స్‌పై వేశాడు. మెగా చీఫ్‌కు అనర్హులనుకునేవారికి మిరప దండ వేసి రేసు నుంచి తప్పించాలన్నాడు. అలా మొదటగా మెహబూబ్‌.. ప్రేరణను తగ్గించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్‌.. రోహిణిని, అవినాష్‌.. పృథ్వీని అవుట్‌ చేశారు. చివరగా గౌతమ్‌.. నిఖిల్‌ను అవుట్‌ చేస్తూ విష్ణుప్రియను చీఫ్‌గా గెలిపించారు. అయితే ఒక్కరికే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాట తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియకు ఇచ్చిన ఎన్విలాప్‌లో రూ.2 లక్షలు ఉండగా అది ప్రైజ్‌మనీలో యాడ్‌ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.40,16,000కు చేరింది.

Pushpa 2: 'పుష్ప'కు ఆ సెంటిమెంట్‌ బాగా వర్కవుట్‌ అవుతుందనే నమ్మకం

Updated Date - Oct 26 , 2024 | 11:32 AM