Chiranjeevi: హీరో శ్రీకాంత్ ఇంట్లో చిరు.. మ్యాటర్ ఇదే..
ABN , Publish Date - Mar 23 , 2024 | 10:21 PM
హీరో శ్రీకాంత్ ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి మెరిశారు. శ్రీకాంత్, రవితేజ అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో? అనేక మార్లు చెప్పి ఉన్నారు. వారిద్దరినీ కూడా చిరు తన సొంత తమ్ముళ్లుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ATM ఇంటికి దాదా వెళ్లారు. శ్రీకాంత్ ఇంటికి చిరంజీవి వెళ్లడానికి కారణం.. శనివారం (మార్చి 23) శ్రీకాంత్ పుట్టినరోజు. అందుకోసమని... స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కేక్ తీసుకుని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరీ బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు.
హీరో శ్రీకాంత్ ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మెరిశారు. శ్రీకాంత్ (Srikanth), రవితేజ (Ravi Teja) అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో? అనేక మార్లు చెప్పి ఉన్నారు. వారిద్దరినీ కూడా చిరు తన సొంత తమ్ముళ్లుగా చెప్పుకుంటూ ఉంటారు. దాదా, ATM అంటూ చిరు, శ్రీకాంత్ కలిసి నటించారు కూడా. ఇప్పుడు ATM ఇంటికి దాదా వెళ్లారు. శ్రీకాంత్ ఇంటికి చిరంజీవి వెళ్లడానికి కారణం.. శనివారం (మార్చి 23) శ్రీకాంత్ పుట్టినరోజు. అందుకోసమని... స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కేక్ తీసుకుని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరీ బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. శ్రీకాంత్‌తో కేట్ చేయించి.. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి.. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. (Chiranjeevi Celebrates Hero Srikanth Birthday)
మెగాస్టార్‌కే కాదు.. శ్రీకాంత్‌కి కూడా చిరంజీవి అంటే అంతే ఇష్టం. అన్నయ్యా.. అంటూ ఆప్యాయంగా చిరంజీవిని పిలుస్తుంటారు. వారిద్దరి బాండింగ్ ఎన్నో సందర్భాలలో ప్రత్యక్షంగానూ ప్రేక్షకులు చూసి ఉన్నారు. చిరు, శ్రీకాంత్‌ల మధ్య బాండింగ్ (Bonding Between Chiru and Srikanth) ఎలా ఉంటుందనేది.. శ్రీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ఇప్పుడు మరోమారు సుస్పష్టమైంది. శ్రీకాంత్‌తో చిరు కేక్ కట్ చేయిస్తోన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో శ్రీకాంత్ కుమారుడు రోషన్ (Roshan) కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు మెగా ఫ్యాన్స్‌కి యమా కిక్కిస్తున్నాయి. (#HBDSrikanth)
ఇవి కూడా చదవండి:
====================
*Chiranjeevi: ‘అదే రక్తం.. అదే పౌరుషం’ డైలాగ్‌ని మార్చిన చిరు..
**************************
*Bade Miyan Chote Miyan: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..
*******************************
*Manchu Vishnu: చిరుకి పద్మ విభూషణ్, అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్, జై బాలయ్య.. ‘నవతిహి’ విశేషాలివే!
******************************