Vijay Binni: ‘నా సామిరంగ’ రిజల్ట్‌పై దర్శకుడి రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Jan 15 , 2024 | 04:45 PM
కింగ్ నాగార్జున హీరోగా.. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగ’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఆదివారం (జనవరి14న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్యూ మీట్‌లో దర్శకుడు తన సంతోషాన్ని వెలిబుచ్చారు.
కింగ్ నాగార్జున (King Nagarjuna) హీరోగా.. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఆదివారం (జనవరి14న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల, అభిమానులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోన్న ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్ బిన్ని తన సంతోషాన్ని తెలియజేశారు. (Naa Saami Ranga Thanks Meet)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సామిరంగ’ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికి థాంక్స్. ఈ సినిమాలో వింటేజ్ నాగార్జున గారిని చూపిస్తానని మాటిచ్చాను. ఇప్పుడు ప్రేక్షకుల, అభిమానుల రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని తీశాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం ప్రేక్షకుల నుంచి వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా వుంది. నన్ను దర్శకుడిగా ఎంచుకున్న నాగార్జునగారికి ధన్యవాదాలు. నరేష్ గారికి థాంక్స్. ఆయన సీన్స్ చూసి ప్రేక్షకులు థియేటర్స్‌లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఆషికా ఈ సినిమాతో అందరి ఫోన్‌లో వాల్ పేపర్ అయిపోతారు. (Vijay Binni Happy with NSR Success)
ఈ సినిమా ఇంత స్పీడ్‌గా చేయడానికి, ఇంత గొప్ప క్యాలిటీతో రావడానికి కారణం మా నిర్మాత శ్రీనివాసాగారు. పవన్ గారికి ధన్యవాదాలు. ఈ టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని షార్ట్ స్పాన్‌లో పూర్తి చేశామని అంటున్నారు. ఇది ఎవరైనా చేయవచ్చు. ఇది చేయాలంటే మంచి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వుండాలి. మా టీం అంతా చాలా కష్టపడ్డారు. కీరవాణి గారు ఇచ్చిన అద్భుతమైన పాటలు నేపథ్య సంగీతాన్ని ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. చంద్రబోస్ గారు వండర్‌ఫుల్ లిరిక్స్ ఇచ్చారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ థియేటర్స్‌కి రండి. పండగ పూట ‘నా సామిరంగ’ని ఎంజాయ్ చేయండని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
====================
*Teja Sajja: ‘హను-మాన్’ విడుదల తర్వాత మెగాస్టార్ ఏమని మెసేజ్ చేశారంటే..
***************************
*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఓటీటీలోకి వచ్చే డేట్ ఫిక్స్
**************************
*Guntur Kaaram: రెండో రోజూ రమణగాడు రాంప్ ఆడేశాడు.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
****************************