Lucky Baskhar Twitter Review: ‘లక్కీ భాస్కర్’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Oct 31 , 2024 | 10:13 AM
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. ‘సార్’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందంటే..
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. ‘సార్’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా నేడు (అక్టోబర్ 31) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైందీ సినిమా. విడుదల 31వ తేదీ అయినప్పటికీ అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ఈ సినిమాకు ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ సినిమాను చూసిన నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’కు ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందంటే.. (Lucky Baskhar Twitter Talk)
Also Read- KA Review: కిరణ్ అబ్బవరం కొత్త ప్రయత్నం 'క' ఎలా ఉందంటే
ఇప్పటి వరకు వెంకీ అట్లూరి చేసిన చిత్రాలలో ది బెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ అద్భుతంగా చేశాడు. మీనాక్షి చౌదరం అందం, ఫస్టాఫ్ ఎంగేజింగ్ క్లాస్ మూవీ.. సెకండాఫ్ అద్భుతం అంటూ ఓ నెటిజన్ 4 స్టార్స్ ఇచ్చారు.
మరో నెటిజన్ సినిమా స్టోరీని క్లుప్తంగా చెప్పడంతో పాటు సినిమాలోని పాజిటివ్స్, నెగిటివ్స్ ఏంటో కూడా తెలిపారు. ముందుగా పాజిటివ్స్ విషయానికి వస్తే.. దుల్కర్, మీనాక్షి పాత్రల తీరుతెన్నులు, అభినయం, మనీతో థీమ్‌ని లింక్ చేసిన విధానం, షాపింగ్ సీన్స్, సన్నివేశాలకు అనుగుణంగా ఎమోషన్స్, క్లైమాక్స్, బీజీఎమ్, సినిమాటోగ్రఫీ. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే.. ఊహించిన విధంగా స్ర్కీన్‌ప్లే ఉండగా, మైనర్ లోపాలతో పాటు సాగదీత అనిపించే సీన్లు అని తెలుపుతూ.. సదరు నెటిజన్ ఈ సినిమాకు 3 రేటింగ్ ఇచ్చారు. (Lucky Baskhar Twitter Review)
ప్లాట్‌లైన్ సింపుల్‌గానే ఉన్నా దుల్కర్ తన నటనతో, దర్శకుడు తన డైరెక్షన్‌తో సాలిడ్‌గా మార్చేశారు. ఎంగేజింగ్ స్టోరీ, మీనాక్షి చౌదరి అందం, వెంకీ అట్లూరి నీట్ స్ర్కీన్‌ప్లే ఈ సినిమాకు బలం. కొన్ని అక్కరలేని సీన్లు ఉన్నప్పటకీ.. ఓవరాల్‌గా మాత్రం చూడాల్సిన చిత్రం ‘లక్కీ భాస్కర్’ అని ఓ నెటిజన్ షేర్ చేసుకున్నారు.
మొత్తంగా అయితే ఇప్పటి వరకు ట్విట్టర్‌లో ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వినబడుతోంది. అసలీ చిత్రం ఎలా ఉంది? బాక్సాఫీస్ దగ్గర నిలబడే చిత్రమేనా? వంటి విషయాలను కాసేపట్లో రివ్యూలో తెలుసుకుందాం.