Game Changer: రిలీజ్ డేట్‌తో ఫ్యాన్ మేడ్ పోస్టర్.. చిత్ర టీమ్‌ని కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది.

ABN , Publish Date - Sep 18 , 2024 | 05:49 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారనే దానికి ఉదాహరణ.. ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చేస్తున్న డ్యూటీనే. అవును.. ఒక ఫ్యాన్ చేసిన ఈ పోస్టర్.. చివరికి చిత్రయూనిట్‌ని కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Ram Charan in Game changer Movie

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) అభిమానులు ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారనే దానికి ఉదాహరణ.. ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చేస్తున్న డ్యూటీనే. అవును.. ఒక ఫ్యాన్ చేసిన ఈ పోస్టర్.. చివరికి చిత్రయూనిట్‌ని కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది. నిజమే అనుకుని.. ఆ టీమ్ మెంబర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. ఎవరా టీమ్ మెంబర్, ఏమా కథ అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. పూర్తి వార్త చదివేయండి మరి.

Also Read- వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించాలని ఉందంటోన్న తారక్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో డైరెక్టర్ శంకర్‌ని, నిర్మాణ సంస్థ ఎస్‌విసి బ్యానర్‌ని ట్యాగ్ చేస్తూ తిట్టిపోస్తున్న సమయంలో.. ఇంక లాభం లేదనుకుని మేకర్స్ వినాయకచవితికి ఓ పోస్టర్ వదిలి.. ఫ్యాన్స్‌ని కాస్త శాంతింపజేశారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్‌ కోసం అభిమానులు డ్యూటీ చేయడం స్టార్ట్ చేశారు.


Ram-Charan.jpg

తాజాగా ఫ్యాన్స్.. ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్‌తో ఓ పోస్టర్‌ని రెడీ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ పోస్టర్ ఎలా ఉందంటే.. నిజంగానే మేకర్స్ విడుదల చేశారేమో అనేలా ఉంది. డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ‘గేమ్ చేంజర్’ విడుదల అంటూ వచ్చిన ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ చూసి.. ఆ సినిమాకు పని చేస్తున్న డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా కూడా నిజమే అనుకున్నారు. ఆయన కూడా ఆ పోస్టర్‌ని తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసి.. ‘డిసెంబర్ 20.. కొత్త ఆట మొదలవుతుంది’ అని తెలపడంతో.. ఫ్యాన్స్ అంతా నిజమే అనుకుని.. ఆయన పోస్ట్‌ని లైక్స్‌తో, రీ ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆ పోస్టర్‌ని తీక్షణంగా చూస్తే కానీ.. అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనేది తెలియడం లేదు. మరి ఈ స్పందనను చూసైనా.. చిత్రయూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూద్దాం.

Sai-Madhav.jpg

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 18 , 2024 | 06:09 PM

Game Changer Audio Rights : ఆడియో రైట్స్‌కు ఎన్ని కోట్లంటే...

Game Changer: మెగా మాస్‌ బ్లాస్ట్‌..వచ్చేస్తుంది

Game Changer: జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. జ‌ర‌గండి జ‌ర‌గండి పాటొచ్చింది

Game Changer: ‘జరగండి’.. లిరికల్ సాంగ్

Game Changer: హమ్మయ్యా.. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్