BiggBoss Telugu8 Gangavva: నిఖిల్.. పెద్ద డేంజర్ గాడు తీసేయాలే
ABN , Publish Date - Oct 19 , 2024 | 08:25 AM
ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందాన బిగ్‌బాస్ 8 తెలుగు వెళుతోంది. మూడు రోజులు ఒకటే టాస్క్‌ను కంటిన్యూ చేయడం చేసే వారికి ఆసహానాన్ని తెప్పించింది.
ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందాన బిగ్‌బాస్ 8 (Biggboss8) తెలుగు వెళ్లుతోంది. ఇదివరకటి సీజన్ల లాగా ఈసీజన్ సరైన రెస్పాన్స్ దక్కించుకోలేక పోతుంది. ఈక్రమంలో ఇప్పటికే సగం బమంది కంటెస్టెంట్స్‌ను బయటికి పంపి వారి స్థానంలో వేరే వారిని అల్రేడీ అనుభవం ఉన్న వారిని తీసుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణను తెచ్చుకోవడంలో విఫలమవుతోంది. తాజాగా ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ అంటూ మూడు రోజులు ఒకటే టాస్క్‌ను కంటిన్యూ చేయడం చేసే వారికి ఆసహానాన్ని తెప్పించింది.
ఈ టాస్క్ సమయంలోనే బిగ్‌బాస్ హౌజ్‌లోని రెండు టీములకు ఓ ఛాలెంజ్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని గుర్తులతో కుషన్స్ పెట్టి. ప్లాస్మాలో చూపించిన సింబల్ ఉన్న కుషన్స్‌ను తీసుకెళ్లి అక్కడే గీసి ఉన్న ఓ బాక్స్‌లో పెట్టాలి. రెండు క్లాన్స్ నుంచి ఒక్కొక్కరు, లేదా ఇద్దరు, ముగ్గురు ఇలా రావాలని, వాళ్లేవరో తానే చెబుతానని బిగ్ బాస్ ప్రకటించాడు.అయితే.. కుషన్స్ తీసుకెళ్లే టైంలో ఇతర క్లాన్స్‌ను అడ్డుకోవచ్చని, కానీ వాటిని బాక్స్‌లో పెట్టాక మాత్రం టచ్ చేయరాదని, అదేవిధంగా కుషన్స్ ఉన్న వాళ్లే బాక్స్‌లోకి వెళ్లాలనే రూల్స్‌ను రోహిణి చెప్పాక ఆట. ఆరంభమైంది.
మొదటి రౌండ్లో ప్రేరణ కుషన్ పెట్టడంతో ఓజీ క్లాన్ గెలవగా ఆ తర్వాత నిఖిల్, నయని పోటీ పడ్డారు. అందులో నయనికి కుషన్ దొరికినప్పటికీ నిఖిల్ దానిని గుంజుకుని బాక్స్‌లో పెట్టడంతో. రెండోసారి కూడా ఓజీ క్లాన్ గెలవగా మూడో రౌండ్లో టేస్టీ తేజ రాయల్ క్లాన్కు ఓ పాయింట్ తీసుకు వచ్చాడు. అయితే పోటీ కొనసాగుతున్న సమయంలోనే ఈసారి అందరిని పంపించాలని అవినాష్ అన్న మాటలను బిగ్ బాస్ విని చివరి రెండు రౌండ్లలో రెండు గ్రూపులలోని వారంతా ఈ పోటీలో పాల్గొనాలని అదేశించాడు. ఇందులో రాయల్ క్లాన్ రెండు రౌండ్లలో విజయం సాధించి బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌ను పూర్తి చేసింది.
ఈ నేపథ్యంలో మెగా చీఫ్ కంటెండర్‌షిప్ రేస్ నుంచి ఓజీలోని ఇద్దరు సభ్యులను తొలగించాలని బిగ్ బాస్ చెప్పడంతో అల్రేడీ ఇప్పటికే నిఖిల్, నబీల్ చీఫ్స్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని మెహబూబ్, హరితేజ అనుకుని గంగవ్వను సలహా అడిగారు. ఈ క్రమంలో గంగవ్వ (Gangavva) అన్న మాటలలు అక్కడి వారిలో నవ్వులు తెప్పించాయి. ఆ నిఖిల్ పెద్ద డేంజర్ గాడు తీసేయాలని అనడంతో వారు షాక్ అయ్యారు. తర్వాత నబీల్ పేరు చెప్పడంతో ఓజీ నుంచి నిఖిల్, నబీల్ను తీసేస్తున్నట్లు రాయల్ క్లాన్ ప్రకటించింది. ఇప్పటికే వారు చీఫ్స్ అయ్యారని తెలిపారు.