Harish Shankar: ‘ఈగల్’లో లవ్ స్టోరీ లేదు.. ‘ఆర్ఆర్ఆర్’లో రొమాన్స్ లేదు
ABN , Publish Date - Feb 11 , 2024 | 09:08 PM
‘ఈగల్’లో లవ్ స్టోరీ అన్నవాళ్లే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రొమాన్స్ లేదని అన్నట్లుగా తనకు తెలిసిందని అన్నారు దర్శకుడు హరీష్ శంకర్. ‘ఈగల్’ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై ఆయన ఫైర్ అయ్యారు. మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఈగల్’. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హరీష్ శంకర్.. సినిమాపై విమర్శలు చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు.
‘ఈగల్’లో లవ్ స్టోరీ అన్నవాళ్లే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రొమాన్స్ లేదని అన్నట్లుగా తనకు తెలిసిందని అన్నారు దర్శకుడు హరీష్ శంకర్. ‘ఈగల్’ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై ఆయన ఫైర్ అయ్యారు. మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఈగల్’. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హరీష్ శంకర్.. సినిమాపై విమర్శలు చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ..
‘‘కారైకూడిలో ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ చేస్తున్నాం. మా కోసం ప్రత్యేకంగా ‘ఈగల్’ షో వేశారు. ఫస్టాఫ్ చూసిన తర్వాత బాగుంది అనిపించింది. సెకండాఫ్ చూసిన తర్వాత మైండ్‌బ్లోయింగ్ అనిపించింది. అమేజింగ్ ఫిల్మ్. ఇలాంటి పాయింట్‌ని ఇంత స్టయిలిష్‌గా చెప్పడం మాములు విషయం కాదు. అందుకు కార్తీక్‌కు కంగ్రాట్స్ చెబుతున్నాను. నిజంగా చెప్పాలంటే.. ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే.. ఇంత గొప్పగా తీసి ఉండేవాడిని కానేమో. సినిమా రిలీజ్‌కు ముందు నుండి రవితేజగారు ముగ్గురు గురించి చాలా బాగా చెబుతుండేవారు. అందులో డైలాగ్ రైటర్ మణిబాబు ఒకరు. నిజంగానే అతను చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత దేవ్ జాంద్. ఆయన పేరును పలకడం కోసం ఎంత ప్రాక్టీస్ చేశానంటే.. నేను చదువుకునే రోజుల్లో కూడా అంత ప్రాక్టీస్ చేయలేదు. ఆయన పేరులోనే మ్యూజిక్ ఉంది. అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ప్రస్తుతం నేను ‘మిస్టర్ బచ్చన్’ చేస్తున్నాను. ‘ధమాకా’కు ‘ఈగల్’కు సంబంధం లేదు. అలాగే ‘ఈగల్’కు ‘మిస్టర్ బచ్చన్’కు కూడా ఏ మాత్రం సంబంధం ఉండదు. మూడు వైవిధ్యమైన చిత్రాలను రవన్నకు అందించినందుకు మనస్ఫూర్తిగా విశ్వప్రసాద్‌గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు. దేవుడు మేలు చేస్తే, వెబ్‌సైట్స్ అనుకూలిస్తే మనం కూడా హ్యాట్రిక్ కొడతాం.
మేము షూటింగ్‌లో ఉండి సినిమా చూడలేదు. అసలు సినిమా టాక్ ఏంటా? అని సోషల్ మీడియా చూశాను. లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ఒక ట్వీట్ చూశాను. లవ్ స్టోరీ ఇంకా బాగా చేయవచ్చు అన్నట్లుగా ట్వీట్ చేశారు. నాకు తెలియక అడుగుతున్నా.. టైటిల్ ఏమైనా ‘ప్రేమ పావురాలు’ అని పెట్టారా? లవ్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయడానికి. ‘ప్రేమ పావురాలు’, ‘ప్రేమ పంజరం’, ‘ప్రేమాలయం’ అని టైటిలేం పెట్టలేదు కదా. తుపాకీ పట్టుకుని, అంత గడ్డం పెట్టుకుని షూట్ చేసుకుంటే వెళుతుంటే.. అందులో లవ్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేశారంటే.. ఏంటో నాకసలేం అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా.. మళ్లీ కాంట్రవర్సీ.. లేనిపోనివి వంద రాసేస్తారు. మీరనుకోవడం మానరు.. నేను అనడం మానను... సరిపోతుంది అలాగా. కార్తీక్ గురించి ఒక్కసారి ఆలోచించండి. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలనేం లేదు.
చాలా మంది నా దగ్గరకు వచ్చి.. సార్.. మీ గబ్బర్ సింగ్, మిరపకాయ్ సినిమాల కంటే ‘షాక్’ సినిమా బాగా నచ్చిందని అంటుంటారు. అలాంటి వాళ్ల ముందు తెల్లముఖం వేసుకుని నిలబడతా.. అలాంటి వాళ్లు స్టేట్ అంతా ఉంటే బాగుండు అని అనుకుంటా. కానీ అర్థం చేసుకోవాలి. సినిమాను విమర్శించే ముందు.. కార్తిక్ ఒక అద్భుతమైన సినిమాటోగ్రాఫర్. ఆయన చేయాలి అనుకుంటే.. ఇప్పుడాయన చేతిలో వరసగా 10 సినిమాలుంటాయ్. చాలా మంది దర్శకులు నా దగ్గరకు వచ్చి కూడా ఆయన పేరు చెబుతుంటారు. మంచి సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని.. అంతటితో సంతృప్తి పడకుండా.. కష్టపడి, డైరెక్టర్ అయ్యే స్థాయికి వచ్చారు. ఈ రోజు ప్రపంచం అంతా మెచ్చుకునే ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది.. ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనేది పక్కన పెడితే.. అతడిని విమర్శించే ముందు.. ఒక్కసారి అతని జర్నీ గురించి ఆలోచించాలి కదా. ‘లవ్ స్టోరీ’ లేదు అనే మాట విని చాలా బాధేసింది. తర్వాత ఆరా తీస్తే.. ఇదే బ్యాచ్ ‘ఆర్ఆర్ఆర్’లో రొమాన్స్ లేదని అన్నారట. ఆ తర్వాత తెలిసింది నాకు. ఎవరా వ్యక్తి అంటే.. తర్వాత చెప్పారు.
ఒక విషయం మనందరం మరిచిపోయామా.. లేదా మనలో కొందరు మరిచిపోయారా? అనేది తెలియదు. గుర్తుంటే సంతోషం.. గుర్తులేని వారికి గుర్తు చేస్తున్నాను. నేనేం ప్రవచనాలు ఇవ్వడం లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే.. సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ నటులు, సినీ జర్నలిస్ట్‌లు కూడా. అందరూ ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద, మేము మీ మీద.. రాళ్లు వేసుకోవడానికి.. మీరు ఆ గట్టున, మేము ఈ గట్టున లేము. సినీ జర్నలిస్ట్‌లు అంటే.. ఇండస్ట్రీలో ఒక భాగం. దయచేసి మరిచిపోకండి. మీరు పబ్లిసిటీ చేస్తేనే మా సినిమాలు జనాల్లోకి వెళతాయి. మరి మనం ఒకరి మీద ఒకరం రాళ్లు వేసుకోవడం ఏంటి? ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే.. నేను ఈ మధ్య ఓ సినీ జర్నలిస్ట్‌పై కౌంటర్ వేసినందుకు నాకు బోలెడన్ని ఫోన్లు వచ్చాయి. ‘గబ్బర్ సింగ్’ సినిమా హిట్ అయినప్పుడు కూడా అన్ని ఫోన్లు రాలేదు. నేను రియలైజ్ అయ్యా. నేనేం గొప్పగా మాట్లాడలేదు. ఆ వీడియో మళ్లీ చూశా. నేను గొప్పగా మాట్లాడలేదు.. అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అతనిపై ఉన్న కసి.. నాపై అప్రిసియేషన్‌గా మారి నాకు అన్ని ఫోన్లు వచ్చాయని అప్పుడర్థమైంది. తర్వాత ఆలోచిస్తే నాకు చాలా బాధేసింది. మనం అంతా ఒక ఇండస్ట్రీ అయితే.. బయటి వాళ్లు, సోషల్ మీడియాలో మనల్ని చూసి నవ్వుకోవడం ఏంటి? అని బాధేసింది..’’ అని హరీష్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
====================
*Nikhil: అప్పుడే నిఖిల్‌కు డైపర్ క్లాస్‌లు మొదలయ్యాయ్..
***************************
*Devara: మరో హీరోయిన్ ఈ మరాఠీ బ్యూటీనా.. ఫొటోలు వైరల్
******************************
*Priyamani: అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా..
******************************