Kiran Abbavaram: మిమ్మల్ని ఏ రోజైనా ఏమైనా అడిగానా.. ఆ సినిమాలో నన్ను ఎందుకు ట్రోల్ చేశారు
ABN , Publish Date - Oct 30 , 2024 | 09:25 AM
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా క. తాజాగా నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనపై జరిగిన ట్రోలింగ్‌పై స్పందించారు.
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క (Ka Movie). ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య, నిర్మాత ఎస్కేఎన్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తన వ్యక్తిగద విషయాలతో పాటు తనపై సోషల్ మీడియాలో, ఓ మూవీలో తనపై చేసిన ట్రోలింగ్‌పై స్పందిస్తూ ఓ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.
"నేను చేసిన కొన్ని సినిమాలు నచ్చాయ్.. కొన్ని సినిమాలు పోయాయ్.. ఓకే. కానీ నా బాధ ఏంటంటే నాతో మీకు ఏంటి ప్రాబ్లమ్.. ఈ విషయం నేను మీకు చెప్పాలి.. ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్లు మళ్లీ నాపైన పగబడతారని నాకు తెలుసు. అయినా సరే నేను చెబుతాను.. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక కంపెనీ ఉంటుందండి.. నేను చాలా బ్యాడ్‌గా ఫీలయ్యా.. హర్ట్ అయ్యా.. అందుకే చెబుతున్నాను.. ఏదో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చాను.. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తున్నాను.. ఇదంతా పక్కన పెడితే నా మీద వాళ్ల సినిమాలో ట్రోలింగ్ చేశారండి.. ఏమైనా సంబంధం ఉందా.. నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది సినిమాలో.. నేను రిక్వెస్టింగ్‌గానే అడుగుతున్నా.. ఎందుకన్నా నా మీద.. నా పని ఏదో నేను చేసుకుంటున్నాను.. మిమ్మల్ని ఏ రోజైనా ఏమైనా అడిగానా ఏంటి.. నా మీద సినిమాలో డైరెక్ట్‌గా ట్రోలింగ్.. అది కూడా కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారు.
ఓ రోజు నా ఫ్యాన్ ఒకరు అది పంపించి.. ఏంటి బ్రో మీ గురించి మరీ సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పాడు. అసలు నా గురించి మీ సినిమాలో ట్రోల్ చేసేంత నేను ఏం చేశాను చెప్పండి.. అసలు నాతో మీకు ఫ్రాబ్లమ్ ఏంటి.. నేను ఎదగకూడదా.. సినిమాలు చేయకూడదా అని ాగ్రహం వ్యక్తం చేశారు. హీరోల్లో ఎవరికి హిట్లు లేవు.. ఎవరికి ఫ్లాపులు లేవు.. చెప్పండి. నేను చేసిన 8 సినిమాల్లో నాలుగు డీసెంట్ సినిమాలు ఉన్నాయి. నేను ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. నాలాంటి వాడు సినిమా తీసి థియేటర్లోకి తీసుకురావడమే పెద్ద సక్సెస్.. హిట్టు ఫ్లాపులు తర్వాత. ఇప్పుడు నేను ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే నేనేదో పెద్ద పొడిచేసిన సినిమా తీశానని చెప్పడం లేదు.. దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాడి గురించి చిన్నగానైనా ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలా బావుంటుంది.. మీకు ఫ్యామిలీలు ఉన్నాయి.. మీరూ ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు.. మీకు తెలుస్తది.. నిజమే నేను కొన్ని చెత్త సినిమాలు తీశాను.. భవిష్యత్తులో కూడా అన్నీ మంచి సినిమాలు చేయలేను.. కానీ ఒక యాక్టర్‌గా నేను కష్టపడతాను." అంటూ కిరణ్ అబ్బవరం అన్నారు.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా చాలామంది హీరోకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. సదరు సంస్థను ,ఆసినిమాపై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మరికొంతమంది కిరణ్‌పై ట్రోలింగ్ చేసిన సినిమా ఇదేనంటూ 'బాయ్స్ హాస్టల్' సినిమా క్లిప్పును, ఆ సంస్థ పేరును తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.