KA Twitter Review: ట్విట్టర్‌లో ‘క’ మూవీ టాక్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Oct 31 , 2024 | 07:43 AM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీపై ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందంటే..

KA Movie Still

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించగా.. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా దీపావళి కానుకగా నేడు (అక్టోబర్ 31) తెలుగులో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలతో పాటు.. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అబ్బవరం స్పీచ్‌తో ఒక్కసారిగా ఆడియెన్స్ అటెన్షన్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా టాక్ కూడా బయటికి వచ్చేసింది. నెటిజన్లు చాలా మంది ఈ సినిమా ఎలా ఉందో తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేస్తున్నారు. మరి ‘క’ ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.. (Ka Movie Twitter Talk)

ఇండియన్ సినిమాలోనే ఇంతవరకు ఇలాంటి క్లైమాక్స్ చూడలేదు. స్ర్కీన్‌ప్లే ఇంకాస్త క్రిస్పీగానూ, అలాగే ఎమోషన్స్ డోస్ ఇంకాస్త పెంచి ఉండొచ్చు. అయితేనేం, కిరణ్ అబ్బవరం నుండి సరికొత్త సాలిడ్ అటెంప్ట్ ఇది అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.


ఫస్టాఫ్ తీసుకున్న ప్లాట్ చాలా డీసెంట్‌గా ఉంది. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ థ్రిల్లింగ్, శామ్ సిఎస్ ఇచ్చిన మ్యూజిక్ పిచ్చెక్కించేసింది. కెమెరామెన్ పనితనం, క్వాలిటీ సూపర్ అంతే. ఇక చివరి 20 నిమిషాలు మాత్రం అరుపులే.. కిరణ్ అబ్బవరం కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇది అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చారు. (Ka Movie Twitter Review)


‘క’ మూవీ పాజిటివ్స్.. న్యూ కాన్సెప్ట్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ‘క’ మూవీ నెగిటివ్స్.. స్లో ఫేస్డ్ అండ్ అవుట్‌డెటెడ్ స్ర్కీన్‌ప్లే, ఫైట్ సీక్వెన్సెస్. ఓవరాల్ రేటింగ్ 3 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.


ఎంగేజింగ్ థ్రిల్లర్.. మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్. హీరో కిరణ్ అబ్బవరంలో న్యూ వేరియేషన్ మరియు విభిన్నమైన కిరణ్ అబ్బవరంని చూస్తారు. ఫస్టాఫ్: ఇంట్రోస్, ప్లాట్ సెట్టింగ్, బ్యూటీ‌ఫుల్ సాంగ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్‌తో నడవగా.. సెకండాఫ్ ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్, జాతర సాంగ్, క్లైమాక్స్, ఎడ్ల బండి మీద చేజ్ సీన్‌కి గూస్ బంప్స్ పాక్కా.. మళ్లీ కొన్ని నమ్మకాలతో ట్విస్ట్. ఓవరాల్‌గా ‘క’ టీమ్ నుండి ఒక బ్లాక్‌బస్టర్ అటెంప్ట్.

ఇలా ప్రస్తుతానికైతే.. ట్విట్టర్‌లో ఈ సినిమాకు పాజిటివ్ టాకే వినబడుతోంది. చూసిన వారంతా సరికొత్త అటెంప్ట్ అంటూ కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - Oct 31 , 2024 | 07:48 AM