Konda Surekha: చైతూ-సమంత విడాకులు, రకుల్ హడావుడి పెళ్లి.. కారణం కేటీఆరే..
ABN , Publish Date - Oct 02 , 2024 | 03:46 PM
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. అంతే కాదు సమంతను కేటీఆర్ దగ్గరకు పంపేందుకు నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి తెచ్చారనేలా ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అసలు కొండా సురేఖ ఏమన్నారంటే..
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya), హీరోయిన్ సమంత (Samantha) విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. అలాగే మరో యంగ్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆరే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అలాగే సినీ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి. బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
Also Read- Pawan Kalyan: తిరుమలలో పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె.. డిక్లరేషన్ ఇచ్చి దైవ దర్శనానికి
‘‘కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటు.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే. కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు. వారికి మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆరే. ఆయన డ్రగ్స్‌కు అలవాటుపడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. బీఆర్ఎస్ దొంగ ఏడుపులు మాకవసరం లేదు. హరీశ్ రావు మనస్సున్న మనిషిగా స్పందించారు. నాపై ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు. మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. దుబాయి నుంచి నాలుగు సోషల్ మీడియా అకౌంట్లతో నాపై ఫేక్ పోస్టులు పెడుతున్నారు’’ అని సురేఖ అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘N కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత నా దగ్గరకు రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడు. నాగార్జున (King Nagarjuna), నాగ చైతన్య మాట్లాడి సమంతను కేటీఆర్ (KTR) దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారు. కేటీఆర్ దగ్గరికి వెళ్ళడానికి సమంత ఒప్పుకోలేదు. కేటీఆర్ దగ్గరకి వెళ్ళకపోతే మా ఇంట్లో ఉంటే ఉండు.. లేకపోతే వెళ్ళిపో అన్నారు. అది భరించలేకనే సమంత విడాకులు తీసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హుటాహుటిన పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్. హీరోయిన్లకి మత్తుమందు అలవాటు చేసింది కేటీఆర్. విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయి పంపించాడు. దుబాయ్ నుండి సోషల్ మీడియాను ఆపరేట్ చేయమని కేటీఆర్ కొందరిని పురమాయించాడు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్. ఇప్పుడు సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు’’ అంటూ కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్స్‌పై కేటీఆర్ అండ్ నాగ్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.