Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై మంచు మోహన్ బాబు స్పందనిదే..
ABN , Publish Date - Feb 02 , 2024 | 03:41 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డులపై తాజాగా మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నానని అన్నారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్వీట్లో చెప్పుకొచ్చారు. గద్దర్‌తో తనుకున్న అనుబంధాన్ని మరొక్కసారి మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) సంచలన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై కళాకారులకు ఇచ్చే నంది అవార్డు స్థానంలో.. గద్దర్ జయంతి రోజు.. ఆయన పేరిట కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డు (Gaddar Award)ను ప్రదానం చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా.. అక్కడక్కడా నంది అవార్డుల పేరు మార్చవద్దని.. అవసరమైతే గద్దర్ పేరిట కొత్తగా అవార్డులు ఇవ్వండి అనేలా కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ అవార్డులపై తాజాగా మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ట్విట్టర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నానని తెలిపిన మోహన్ బాబు.. ఇది సాంస్కృతిక గుర్తింపు పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఇక నా సోదరుడు గద్దర్ విషయంలో మరోసారి గర్వపడుతున్నానని తెలిపిన ఈ కలెక్షన్ కింగ్.. గద్దర్ పాటలు సమాజ పరివర్తనకు ఉత్ప్రేరకంగా పనిచేశాయని అన్నారు. గద్దర్ పేరిట అవార్డులను ఇవ్వడమనేది.. ఆయన చేసిన కృషికి, త్యాగానికి గొప్ప గౌరవ సూచికంగా భావిస్తున్నానని అన్నారు. వ్యక్తిగతంగా ఈ విషయం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ఈ ట్వీట్లో పేర్కొన్నారు. (Mohan Babu on Gaddar Awards)
ఈ ట్వీట్లో గద్దర్‌ను శాలువాతో సన్మానిస్తోన్న ఫొటోని కూడా ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఉన్నారు. గద్దర్‌కు, మోహన్ బాబు (Gaddar and Mohan Babu)కు మధ్య ఎలాంటి స్నేహసంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గద్దర్ స్వతంత్రంగా ఇంటిలోకి వెళ్లే వ్యక్తులలో మోహన్ బాబు ఒకరు. గద్దర్ చనిపోయినప్పుడు.. మోహన్ బాబు కన్నీరుమున్నీరయ్యారు. తోడబుట్టిన వాడిని కోల్పోయినట్లుగా ఆయన బాధపడ్డారు. ఇప్పుడు గద్దర్ పేరిట అవార్డ్ ప్రకటించడంతో.. ఆయన ఆనందానికి అవధులు లేవనే విషయాన్ని ఇలా ట్వీట్లో తెలియజెప్పారు.
ఇవి కూడా చదవండి:
====================
*Bubblegum: సుమ తనయుడి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..
**************************
*Nandi Awards: నంది అవార్డ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
***************************
*Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..
******************************